
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చాలాసార్లు చూస్తుంటాం. కొన్నిటిని చూసిన తర్వాత జనాలు షాక్ అవుతారు. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి కనిపించింది. అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇలాంటిది ఇంతకు ముందు మార్కెట్లో ఇలాంటి వస్తువు అమ్ముడుపోవడం మీరు ఖచ్చితంగా ఎప్పుడూ చూసి ఉండరు. అందుకే ఈ వీడియో వచ్చిన వెంటనే ప్రజాదరణ పొందింది.
వేసవి కాలంలో కీర దోసకు చాలా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా కీర దోస ప్రజాదరణ పొందింది. ఎందుకంటే శరీరానికి నీటిని అందిస్తుంది కనుక. దీనిని తినడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అందుకనే కీర దోసలు లేదా కీర దోస ముక్కలను అమ్ముతూ ఉంటారు. కనీ మీరు మార్కెట్లో కీర దోస కాయ తొక్క అమ్ముతున్నట్లు చూశారా? ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి కీరదోసకాయ తొక్కలను అమ్ముతున్నట్లు కనిపిస్తుంది.
ఒక దుకాణదారుడు ఒక పెద్ద బండి మీద చాలా ఆకుపచ్చ తొక్కలను అమ్ముతున్నట్లు కనిపిస్తుంది. అవి చాలా తాజాగా కనిపిస్తున్నాయి. వీడియో తయారు చేస్తున్న వ్యక్తి.. దాదా ఈ కీర దోస తొక్కలు కిలోకు ఎంత అని అడగగా.. దానికి దాదా – కిలో 10 రూపాయలు అని చెప్పాడు. సరే ఇవ్వు అని అనగా.. వెంటనే దాదా ఒక పేపర్ తీసుకుని దానిలో కొన్ని తొక్కలు, ఆపై మసాలా వేసి ఆ వ్యక్తికి ఇచ్చాడు. కీర దోస తొక్క కొన్నిసార్లు చేదుగా అనిపించవచ్చు. కానీ ఈ తొక్క పోషకాలతో నిండి ఉంటుంది. కీర దోస తొక్కలో ఫైబర్, విటమిన్ కె, యాంటీఆక్సిడెంట్లు, సిలికా పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
ఇది hemant_kumanr_9 అనే ఖాతా నుంచి Instagram లో పోస్ట్ చేయబడింది. ఇప్పటికే వేలాది మంది ఈ వీడియోను దీనిని చూశారు. రకరకాల కామెంట్స్ చేస్తూ తమ భావాలను తెలియజేస్తున్నారు. ఈ రోజుల్లో మనిషి చాలా స్వార్థపరుడిగా మారిపోయాడని.. జంతువుల ఆహారాన్ని కూడా తినేస్తున్నాడు అని ఒకరు కామెంట్ చేయగా… మరొకరు కొన్ని రోజుల్లో ఈ దాదా మీ జుట్టు కట్ చేసి అమ్ముతాడని అంటున్నాడు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..