వైరల్‌ వీడియో.. ఈ డ్రైవర్‌ డ్రైవింగ్ స్కిల్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

ముందూ, వెనుకా గొయ్యి, మధ్యలో పార్కింగ్‌లో కారు.. అక్కడ కారును పెట్టాలన్నా, బయటకు తీయాలన్న అంత వీజీ పని కాదు.

వైరల్‌ వీడియో.. ఈ డ్రైవర్‌ డ్రైవింగ్ స్కిల్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

Edited By:

Updated on: Sep 08, 2020 | 8:44 AM

reverses car from parking spot: ముందూ, వెనుకా గొయ్యి, మధ్యలో పార్కింగ్‌లో కారు.. అక్కడ కారును పెట్టాలన్నా, బయటకు తీయాలన్న అంత వీజీ పని కాదు. కొంచెం అటూ ఇటూ అయినా ఆ కారు గొయ్యిలో పడిపోవడం గ్యారెంటీ. అయితే ఆ కారు డ్రైవర్ మాత్రం చాలా అంటే చాలా చాకచక్యంగా పార్కింగ్‌లో పెట్టి, అక్కడి నుంచి దాన్ని బయటకు తీశారు. ఇందుకోసం గంటలు గంటలు కూడా తీసుకోలేదు. నిమిషాల్లోనే అక్కడి నుంచి కారును తీసుకొని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ కారు డ్రైవర్‌ స్కిల్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొందరైతే నోరు వెళ్లపెడుతున్నారు. కాగా ఈ సంఘటన కేరళలలో జరిగినట్లు సమాచారం.

Read More:

పాటతో ప్రారంభం కానున్న ‘పుష్ప’

Breaking: నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత