Breaking: నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిన జయప్రకాష్ రె

Breaking: నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత
Follow us

| Edited By:

Updated on: Sep 08, 2020 | 8:13 AM

Jayaprakash Reddy passes away: టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన బాత్‌రూమ్‌లోనే కుప్పకూలగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే జయప్రకాష్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గుంటూరులోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. జయప్రకాష్ రెడ్డి సొంతూరు కడప జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల.  సినిమాల్లోకి రాకముందు ఎస్సైగా పనిచేసిన జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మపుత్రుడుతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. పలు నాటకాల్లోనూ ఆయన నటించారు.

ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవ రెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, ఛత్రపతి, బిందాస్, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, బాద్షా, రేసుగుర్రం, మనం, రెడీ, పటాస్, టెంపర్‌, సరైనోడు, ఖైదీ నంబర్ 150, జై సింహా, రాజా ది గ్రేట్‌ వంటి హిట్ చిత్రాల్లో నటించిన జయప్రకాష్ రెడ్డి.. చివరిసారిగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరులో కనిపించారు. కమెడియన్‌గా, విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు జయప్రకాష్ రెడ్డి. ముఖ్యంగా ఆయన రాయలసీమ మాండలీకానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి.

Read More:

ఐసీఐసీఐ బ్యాంక్‌ స్కాం‌: చందాకొచ్చర్ భర్త అరెస్ట్‌

చిన్నారుల పౌష్టికాహారంలో పాలను చేర్చండి..