Viral Video: బురద నేలలో ప్రయాణం ఎంత కష్టమో అందరికీ తెలిసింది. పొరపాటున వాహనం బురద మట్టిలో ఇరుక్కుపోయిందో.. ఇక అంతే సంగతి. పదిమంది సాయం చేస్తేగానీ, బయటపడలేని పరిస్థితి. అయితే.. ట్రాక్టర్, లారీ వంటి పెద్దసైజు వాహనాలు తరచుగా బురదలో కూరుకుపోయినప్పుడు, దానిని బయటకు తీయడానికి ట్రాక్టర్‌ని ఉపయోగిస్తుంటారు. ఒకవేళ ఆ ట్రాక్టర్ కూడా గుంతలో కూరుకుపోతే? మరొక ట్రాక్టర్ లేదా మరొక వాహనానికి కాల్ చేయక తప్పదు. అయితే, ఇక్కడ ఓ వ్యక్తి చేసిన అద్భుత ట్రిక్‌తో ఎవరి సాయం లేకుండానే బురదలో కూరుకుపోయిన ట్రాక్టర్ ఈజీగా బయటకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఒక ట్రాక్టర్ బురద మట్టిలో దారుణంగా ఇరుక్కుపోయింది. దానిని బయటకు తీసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఫలితం లేకుండా పోయింది. చివరికి దానికి బయటకు తీయడానికి ఓ వ్యక్తి తెలివైన ఉపాయం చేశాడు. ఒక బలమైన చెక్క కర్రను వెనుక టైరుకు కొంచెం ముందు ఉంచి, ఆపై ట్రాక్టర్ ట్రాలీని పైకి లేపమని డ్రైవర్‌కు సూచించాడు. దాంతో ట్రాక్టర్ వెనుక చక్రం గాల్లోకి లేచింది. ఆ వెంటనే ట్రాక్టర్ కూడా ముందుకు వెళ్ళింది. మనుషుల శ్రమ లేకుండానే బురదలో ఇరుక్కుపోయిన ట్రాక్టర్ ఈజీగా బయటకు వచ్చేసింది. ఇది చూసిన నెటిజన్లు సదరు వ్యక్తిని ఎంతగానో పొగిడేస్తున్నారు. భాయ్ నువ్ సూర్ అంటూ సాల్యూట్ చేస్తున్నారు. ఈ ప్లాన్ చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు నడిపే రైతులకు ఈ ట్రిక్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను ఇప్పుడే చూసేయండి.
Also read:
Pregnant: పండుగ సమయంలో గర్భిణులకు సూచన..! మధుమేహం ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..
polluted cities: ప్రపంచంలోని టాప్ 5 కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఫస్ట్.. రెండో స్థానంలో లాహోర్..
క్యా స్టిల్ హై.. రంగు రంగుల్లో మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టేయండి.. అమ్మడు ఫుల్ హుషారు..