ఓరీ దేవుడో.. నీ ధైర్యానికి సలాం రా సామి!.. ఇలాంటి జంతువులతో పరాచకాలా..?

|

Jan 07, 2024 | 5:04 PM

చూడ్డానికి బాగానే ఉంది.. కానీ, ఇలాంటి జంతువులను పెంపుడు జంతువులుగా ఉంచడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇవి అడవిలో జీవించాల్సిన జంతువులు, వీటిని ఇళ్లలోకి తెచ్చి పెంచడం దారుణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో, వాటిని పెంపుడు జంతువులుగా ఉంచడం ప్రమాదకరమని అంటున్నారు. అవి తమ సహజ స్వభావాన్ని ఎప్పుడు చూపిస్తాయో ఎవరికీ తెలియదని హెచ్చరించే వారు చాలా మంది ఉన్నారు.

ఓరీ దేవుడో.. నీ ధైర్యానికి సలాం రా సామి!.. ఇలాంటి జంతువులతో పరాచకాలా..?
Lion And Leopard Cub
Follow us on

చాలా మంది జంతుప్రేమికులు తమ ఇల్లల్లో కుక్కలు, పిల్లులు, కుందేళ్లను పెంచుకుంటూ ఉంటారు. పెంపుడు జంతువులు ఉన్నవారికి అవి వారి ఇంటి సభ్యుల్లాన్నే భావిస్తారు. వాటితో ఆడుకోవడం, వాటితో సమయం గడపడం అంటే వారికి చాలా ఇష్టం. మనుషులు, పెంపుడు జంతువుల మధ్య సంబంధాన్ని చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతోంది. వీడియోలో ఒక యువకుడు తన పెంపుడు జంతువులతో సరదాగా ఆడుకుంటున్నాడు. పెంపుడు జంతువు అంటే అదేదో కోడి, కుక్క, బాతు, మేక, పిల్లి అనుకుంటున్నారేమో..అదేంటో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు..ఇక చూస్తే భయంతో పరుగులు తీస్తారు.. ఎందుకంటే.. అతని ‘పెంపుడు జంతువులు పులి పిల్ల, ఇంకా సింహం పిల్ల.

అవును, యువకుడు తన పెంపుడు జంతువులతో కూర్చుని వాటిని లాలిస్తున్నాడు. వీడియో మొదట్లో అవేవో పిల్లులు లాగా కనిపిస్తాయి… పిల్లి లాంటి ప్రవర్తన కనిపించిది. అలాగే మనల్ని తక్షణమే ఇష్టపడేలా లేదా ఆప్యాయంగా మార్చే స్వభావం. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చూడదగ్గ దృశ్యమని అంటున్నారు. అయితే ఈ వీడియోపై మంచి మాటల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

చూడ్డానికి బాగానే ఉంది.. కానీ, ఇలాంటి జంతువులను పెంపుడు జంతువులుగా ఉంచడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇవి అడవిలో జీవించాల్సిన జంతువులు, వీటిని ఇళ్లలోకి తెచ్చి పెంచడం దారుణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో, వాటిని పెంపుడు జంతువులుగా ఉంచడం ప్రమాదకరమని అంటున్నారు. అవి తమ సహజ స్వభావాన్ని ఎప్పుడు చూపిస్తాయో ఎవరికీ తెలియదని హెచ్చరించే వారు చాలా మంది ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ఇలాంటి క్రూర జంతువుల పెంపకం అనేక దేశాలలో అనుమతించబడుతుంది. అదే సమయంలో చట్టవిరుద్ధంగా ఇంట్లో వారిని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించడం శిక్షార్హమైనది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..