ఇటీవల ఆన్‌లైన్‌లో వస్తువులు, తినుబండారాలను కొనుగోలు చేస్తోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఆర్డర్ చేసిన వస్తువులకు బదులు వేరొక వస్తువులు కస్టమర్లు అందుకున్న సంఘటనలు మనం చాలానే చూస్తున్నాం. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి బ్రిటన్‌లో వెలుగుచూసింది. ఆలూచిప్స్ ప్యాకెట్‌లో కరకరలాడే చిప్స్ బదులు ఎండిపోయిన బంగాళాదుంప కనిపించింది. దీంతో ఆ ప్యాకెట్ కొన్ని కస్టమర్ షాక్ అయ్యాడు. వివరాళ్లోకి వెళ్తే…లింకన్‌షైర్‌లోని ఉప్పింగ్ హామ్ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేస్తున్నాడు డేవిడ్ బాయ్స్. ఇటీవల అతను ఓ కెటిల్ చిప్స్ ప్యాకెట్ కొన్నాడు. ఎంతో ఆశగా చిప్స్ తినేందుకు ప్యాకెట్ తెరచి చూడగా అందులో ఒక బంగాళాదుంప మాత్రమే ఉంది. దీంతో ఖంగుతున్న ఆ కస్టమర్ ఆ చిప్స్ ప్యాకెట్, ఆలుగడ్డను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అనంతరం ఆ చిప్స్ ప్యాకెట్ తయారీ సంస్థకు ఫిర్యాదు చేశాడు.
బంగాళాదుంపను బహుమతిగా పొందారు..
‘నేను ఈ రోజు కెటిల్ చిప్స్ ప్యాకెట్ తెరిచాను. కానీ అందులో క్రిప్స్ కనిపించలేదు. కేవలం ఒక బంగాళాదుంప మాత్రమే ఉంది’ అని డేవిడ్ షేర్ చేసిన పోస్ట్‌పై సదరు చిప్స్ తయారీ సంస్థ స్పందించింది. అతనికి క్షమాపణలు చెప్పింది. ఈ పొరపాటు ఎలా జరిగిందో తెలియదని…ఆ ప్యాకెట్‌ను తమకు అందజేస్తే పూర్తి వివరాలు సేకరించి విచారణ చేపడతామని రీట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘డేవిడ్ చిప్స్ ప్యాకెట్‌ను కొంటే బంగాళా దుంపను బహుమతిగా పొందారు’ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
So I opened a bag of @KETTLEChipsUK today to find no crisps. Just a whole potato. ? pic.twitter.com/PGEqGMqIWF
— Dr David Boyce (@DrDavidBoyce) October 16, 2021
Also Read:
Viral News: కంటైనర్‌ను ఓపెన్ చేసి చూడగా షాక్.. భయంతో ఒక్కసారిగా కళ్లు తేలేసారు.!
Viral News: కంటైనర్‌ను ఓపెన్ చేసి చూడగా షాక్.. భయంతో ఒక్కసారిగా కళ్లు తేలేసారు.!
పంజాబీ భాంగ్రా పాటకు స్టెప్పులు.. రావణుడి ఫన్నీ డాన్స్ వీడియో వైరల్!