Viral: పెట్రోల్ బంక్‌లో భర్త అనుకుని మరో వ్యక్తి బైక్ ఎక్కిన మహిళ.. కట్ చేస్తే

|

Feb 10, 2023 | 2:38 PM

పెట్రోలు పోయించుకునేందుకు వెళ్లిన వ్యక్తికి- అక్కడే నిలబడి ఉన్న మహిళను బైక్ ఎక్కమన్నాడు. పిలిచింది తన భర్తే అని ఆమె ఎక్కేసింది. కానీ

Viral: పెట్రోల్ బంక్‌లో భర్త అనుకుని మరో వ్యక్తి బైక్ ఎక్కిన మహిళ.. కట్ చేస్తే
Trending News
Follow us on

ఇదేదో సినిమా సీన్ అనుకోకండి నిజంగా జరిగిన ఘటన. భార్యభర్తలు బైక్‌పై ప్రయాణిస్తున్నారు. పెట్రోల్ కొట్టించుకునేందుకు ఓ బంక్ దగ్గర ఆగారు. ఆ భార్య బైక్‌ నుంచి దిగింది. ఫ్యూయల్ ఫిల్ చేసిన అనంతరం.. భర్త ఎక్కగమనగానే బైక్ ఎక్కేసింది. కొంతదూరం వెళ్లిన తర్వాత రూట్ మారడంతో భార్యకు డౌట్ వచ్చింది. ‘ఏంటండీ.. మనం వెళ్లాల్లిన రోడ్ ఇది కాదు కదా’ అని అడిగింది. ‘ఏంటి నా భార్య వాయిస్ ఇలా ఉండదే’ అని అతడు కూడా బైక్ ఆపి వెనక్కి తిరిగి చూసి స్టన్నయ్యాడు. ఆమె తన వైఫ్ కాదు. మరో మహిళ. హావేరి జిల్లా రాణేబెన్నూరులో బుధవారం సాయంత్రం ఈ ఇన్సిడెంట్ జరిగింది. అసలు పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం పదండి.

భార్యతో కలిసి పెట్రోలు కొట్టించుకునేందుకు వెళ్లిన వ్యక్తికి- అక్కడే నిలబడి ఉన్న మహిళను బైక్ ఎక్కమన్నాడు. ఆమె కూడా పరధ్యానంగా బైక్ ఎక్కి కూర్చింది. తన వైఫ్ కట్టుకున్న రంగు చీరే కట్టుకుని ఉండడంతో బైకు ఎక్కిన మహిళ తన భార్యే అని ఆయన భావించాడు. తన హస్పెండ్‌కి ఉన్న బైక్ లాంటిదే అది కూడా.. మనిషి ఒడ్డూ పొడుగూ కూడా అలా ఉన్నాడు .. పైగా వైట్ షర్ట్ ధరించాడు.. ఒకే రంగు హెల్మెట్ ఉండడంతో ఆమెకు కూడా ఎలాంటి డౌట్ రాలేదు.

జరిగిన పొరపాటు అర్థమైన కొద్ది నిమిషాల్లోనే ఆయన తిరిగి ఆమెను పెట్రోలు బంక్ దగ్గరకు తీసుకువచ్చాడు. అప్పటికే ఈయన భార్య, ఆమె భర్త అక్కడ వీళ్లకు ఫోన్ ట్రై చేస్తూ ఉన్నారు. నలుగురూ ఫేస్ కప్పి ఉంచే హెల్మెట్స్ పెట్టుకోవడంతో.. ఈ పొరపాటు జరిగిందని తెలుసుకుని వారిలో వారు నవ్వుకున్నారు.

మరిన్ని టెండింగ్ న్యూస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..