Viral Video: అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే.. చూస్తే బిత్తరపోతారు

పాములకు సంబంధించిన అనేక వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. సరీసృపాలు ఏం చేసినా.. అదొక ట్రెండ్ అనమాట.

Viral Video: అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే.. చూస్తే బిత్తరపోతారు
Python

Updated on: Nov 14, 2024 | 6:39 PM

ఇంటర్నెట్‌లో తరచూ ఎన్నో రకాల వైరల్ వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. అందులో సరీసృపాలకు సంబంధించిన వీడియోలపై అయితే నెటిజన్లు భలేగా ఆసక్తిని కనబరుస్తారు. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. దాన్ని చూశాక మీరూ షాక్ కావడం ఖాయం. ఆ ఇన్‌స్టా రీల్ ప్రకారం.. ఓ భారీ సైజు ఆకుపచ్చ కొండచిలువను ఒక వ్యక్తి అమాంతం భుజాలపైకి ఎత్తుకున్నాడు.

అతడి పేరు మైక్ హోల్‌స్టన్ కాగా.. అతడొక జూ కీపర్‌గా పని చేస్తున్నాడు. ఇక ప్రాణంతకరమైన కొండచిలువ.. అతడి మెడను గట్టిగా చుట్టుకుంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. చిన్న పొరపాటు జరిగినా.. అనంకొండ మెడకు చుట్టుకుని.. మింగేస్తుందని కామెంట్ చేస్తున్నారు. కాగా, సరీసృపాలలో అత్యంత బరువైనది గ్రీన్ అనకొండ.. క్షణాల్లో ఇది మనిషిని అమాంతం మింగేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..