ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఆలోచనలు కలిగిస్తే.. మరికొన్ని మాత్రం ఆశ్చర్యపరుస్తుంటాయి. కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి.. ప్రాణాల మీదకు తీసుకువస్తాయి అనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నెట్టింట వైరలవుతున్న వీడియో చూస్తే షాకవ్వాల్సిందే. ఇంటి బయట కుక్కను కాపాడే క్రమంలో పసివాడి ప్రాణాలను గాలికి వదిలేశాడు. వెంటనే అప్రమత్తమైన మరో వ్యక్తి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు పరుగులు పెట్టాడు. ఇంతకీ ఎం జరిగిందో తెలుసుకుందామా.
ఆ వీడియోలో ఓ వ్యక్తి చిన్న పిల్లాడితోపాటు.. పెంపుడు కుక్కను తీసుకుని ఇంటి బయట స్త్రోలర్ పై తిరిగేందుకు వెళ్లాడు. అయితే రోడ్డుపై మరో కుక్క అతడివైపు వచ్చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సదరు వ్యక్తి తన పెంపుడు కుక్కను రక్షించుకునేందుకు తన చేదిలోని పసివాడిని రోడ్డుపై వదిలిపెట్టాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మరో వ్యక్తి పిల్లాడి కోసం పరిగెత్తాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను యానిమల్స్ బీయింగ్ జెర్క్ అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.