Watch: వంట విషయంలో ముగ్గురు యువకుల మధ్య గొడవ.. పగతో అర్ధరాత్రి దారుణం..!

|

Nov 04, 2024 | 8:39 PM

మృతుడు దీపు ఆర్థికంగా చాలా పేదవాడు. కొంతకాలం క్రితం నారాయణి నదిలో వాళ్లు ఉంటున్న ఇళ్లు కొట్టుకుపోవడంతో నిర్వాసితులయ్యారు. ఎక్కడో దూరంగా ఓ చిన్న పూరి గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. దీంతో కుటుంబాన్ని పోషించుకోవడానికి రెండు నెలల క్రితం మహారాష్ట్రలోని పూణెకు వెళ్లాడు. ఇప్పుడు ఇలా దారుణ హత్యకు

Watch: వంట విషయంలో ముగ్గురు యువకుల మధ్య గొడవ.. పగతో అర్ధరాత్రి దారుణం..!
Man Kills Co Worker
Follow us on

వంట విషయంలో వివాదం రావడంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన తోటి వర్కర్‌ని దారుణంగా రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని పింప్రి-చించ్‌వాడ్‌లో జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం అక్షరాలా మరణానికి దారితీసింది. 19 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..చించ్‌వాడ్‌లోని వీకేవీ కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు ఒకే రూంలో ఉంటున్నారు. నిందితులు, మృతుడితో పాటు మరో ముగ్గురు ఓ ప్రైవేట్‌ కంపెనీలో కేర్‌ టేకర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ముఖేష్, దీపుల మధ్య వంట విషయంలో వివాదం చెలరేగింది. అనంతరం, అందరూ పడుకున్న సమయంలో దీపుపై ముఖేష్ దాడి చేసి రాడ్డుతో తల పగలగొట్టి హత్య చేశాడు. ఈ ఘటన తర్వాత ముఖేష్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేశారు.

గదిలో అమర్చిన సీసీటీవీలో దీపు హత్య దృశ్యాలు రికార్డయ్యాయి. ఇందులో ముగ్గురు యువకులు నేలపై నిద్రిస్తున్నారు. అటువైపు కూర్చున్న ఓ యువకుడు మొబైల్ ఫోన్ వాడుతున్నాడు. అదే సమయంలో నిందితుడు గోడౌన్‌లోకి వెళ్లాడు. కాసేపు అటు ఇటు చూసాక ఇనుప రాడ్డుతో దీపక్ వద్దకు వచ్చి తలపై కొట్టాడు. కేవలం 20 సెకన్లలో మోహిత్ తలపై రాడ్‌తో 11 సార్లు కొట్టి హత్య చేశాడు. ఇంతలో పక్కనే నిద్రిస్తున్న యువకుడు మేల్కొన్నాడు. దాంతో మొబైల్ ఫోన్ వాడుతున్న యువకుడు కూడా ఇటు వైపుగా చూశాడు..ఒక్కసారిగా వాళ్లంతా భయంతో వణికిపోయారు. దూరంగా పారిపోయారు.. అంతలోనే నిద్రలోంచి లేచిన మరో యువకుడు నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశాడు..అందరూ నిద్రలోంచి లేవటంతో నిందితుడు ముఖేష్‌ తప్పించుకోవడానికి పరిగెత్తాడు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

మృతుడు దీపు ఆర్థికంగా చాలా పేదవాడు. కొంతకాలం క్రితం నారాయణి నదిలో వాళ్లు ఉంటున్న ఇళ్లు కొట్టుకుపోవడంతో నిర్వాసితులయ్యారు. ఎక్కడో దూరంగా ఓ చిన్న పూరి గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. దీంతో కుటుంబాన్ని పోషించుకోవడానికి రెండు నెలల క్రితం మహారాష్ట్రలోని పూణెకు వెళ్లాడు. ఇప్పుడు ఇలా దారుణ హత్యకు గురికావటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతని మృతదేహాన్ని తీసుకురావడానికి, అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా విరాళాలు సేకరించారు. దీపు పని చేస్తున్న కంపెనీనే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించినట్టుగా సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..