Funny Viral video: నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే ఉండదు. ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏంజరిగిన క్షణాల్లో అరచేతిలో ప్రత్యక్షం అయిపోతుంది. కొంత మంది చేసే పనులు కోపాన్ని తెపిస్తే మరి కొన్ని నవ్వులు పూయిస్తాయి. తెలిసి చేస్తారో లేక తెలియక చేస్తారో కానీ వీళ్ళు చేసే వింత చేష్టలు విపరీతంగా నవ్వు తెప్పిస్తాయి. ఈ వీడియో కూడా అలాంటిదే.. ప్రకృతితో ఆటలాడితే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఈ వీడియో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇంతకు అందులో ఏముందంటే.. ఓ అడవిలో ఓ వ్యక్తి చెట్టును విరగ్గొట్టడానికి ప్రయత్నించాడు.. మాములుగా చేస్తే మనోడు వైరల్ ఎందుకు అవుతాడు.. కాస్త వెరైటీగా ట్రై చేసి బుర్ర పగలగొట్టుకున్నాడు.
అడవిలో చెట్టును కొట్టడానికి ప్రయత్నించినా ఆ వ్యక్తి . చెట్టును సగం వరకు నరికి. ఆ తర్వాత గాలిలోకి ఎగిరి దాన్ని తన్నాడు. దాంతో ఆచెట్టు విరిగిపోయింది. అయితే ఆ చెట్టు పై భాగం అతడి నెత్తిమీద పడింది. దాంతో మనోడి బుర్రకు గట్టిదెబ్బే తగిలింది. ఈ ఫన్నీ వీడియో ట్విట్టర్‌లో హోల్డ్ మై బేర్ అనే అకౌంట్‌తో షేర్ అయ్యింది. 87 వేలకు పైగా నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. ఇక ఈవీడియో పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రకృతితో పెట్టుకుంటే ఇలా నే ఉంటుంది..దేవుడు వీడికి తగిన శాస్తి చేశాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
Hold my beer while I kick this tree. ?? pic.twitter.com/7Rklh5KUZt
— ? Hold My Beer ? (@HldMyBeer) September 18, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :