23 Storey Building: ఆకాశహర్మ్యం 23వ అంతస్తుపై దూకుతోన్న వ్యక్తి.. షాకింగ్ వీడియో వైరల్.. చూస్తే గూస్‌బంప్స్ ఖాయం

అతను భవనంపైన అనేక కిటికీలను దాటి.. చివరకు ఒక కిటికీ దగ్గర ఆగి, ఆపై కిటికీ తెరిచి గది లోపలికి వెళ్ళాడు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఈ భవనం 115 ఏళ్ల నాటిదని చెబుతున్నారు.

23 Storey Building: ఆకాశహర్మ్యం 23వ అంతస్తుపై దూకుతోన్న వ్యక్తి.. షాకింగ్ వీడియో వైరల్.. చూస్తే గూస్‌బంప్స్ ఖాయం
Man Jumping On Rooftop

Updated on: Oct 09, 2022 | 1:51 PM

ధైర్యసాహసాలు కలిగిన వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. థ్రిల్ కోసం లేదా తాము అందరికంటే భిన్నం అనిపించుకోవడానికో రకరకాల సహస కార్యాలను ఎంచుకుంటారు. కొన్నిసార్లు  కొందరు చేసే పనులు చాలా ప్రమాదకరంగా .. ప్రాణాలు పోతాయా అన్న విధంగా ఉంటాయి. ఒక చిన్న పొరపాటు ప్రాణాంతకం కావచ్చు.. అయినప్పటికీ ప్రజలు తాము ఎంచుకున్న పనిని చేయడానికి వెనుకాడరు. అయితే ఇటువంటి సాహసాలను చూసేవారు.. వీరికి అజాగ్రత్త ఎక్కువ.. వీరు చేసే పనులు అర్థరహితమైనవని కూడా వ్యాఖ్యానిస్తారు. అయినప్పటికీ కొందరు తమ ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టె పనులు చేస్తూనే ఉంటారు.  ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత ఎవరికైనా ఖచ్చితంగా గూస్‌బంప్స్ వస్తాయి.

నిజానికి ఈ వీడియోలో ఓ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా ఆకాశహర్మ్యం 23వ అంతస్తులో నేలపై నిలబడి ఉన్నట్లుగా దూకుతున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి ఎవరైనా వణికిపోతారు. అయితే ఆ వ్యక్తిలో ఎటువంటి భయం కనిపించలేదు. ఆ వ్యక్తి ఆకాశహర్మ్యం 23వ అంతస్తులో నిలబడి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఆపై మొబైల్‌ని జేబులో పెట్టుకుని ఒక్కసారిగా దూకడం ప్రారంభించాడు. అతను భవనంపైన అనేక కిటికీలను దాటి.. చివరకు ఒక కిటికీ దగ్గర ఆగి, ఆపై కిటికీ తెరిచి గది లోపలికి వెళ్ళాడు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఈ భవనం 115 ఏళ్ల నాటిదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఎమ్మీ అవార్డు గెలుచుకున్న చిత్ర దర్శకుడు ఎరిక్ ల్జంగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘అతను ఏమి చేస్తున్నాడో నాకు తెలియదు. మేము అతనిని మొదటిసారి చూసినప్పుడు, అతను భవనం మీద దూకుతున్నాడు. అని క్యాప్షన్ జత చేశారు.

షాకింగ్ వీడియో వైరల్ 

ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎందుకు ఇలా చేసాడు, మాకు సమాధానం కావాలి’ అని ఒకరు అడుగుతుండగా, ఆయన క్షేమంగా ఉన్నారని కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..