Viral Video: రోడ్డుపై దొరికిన వంద నోటు.. ఆశగా దాన్ని తీసి చూడగా మైండ్ బ్లాంక్.!

మనలో క్రియేటివిటీ ఉంటే.. కోట్లలో డబ్బులు పోసి ప్రకటనలు చేయడమెందుకు.. సింపుల్‌గా తక్కువ ఖర్చుతో మన బ్రాండ్‌ను జనాల్లోకి తీసుకెళ్లిపోవచ్చు. సరిగ్గా ఇలాంటి ఆలోచనే ఒకటి చేశాడు ఓ కెఫే ఓనర్. బడా సంస్థల మాదిరిగా ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి తన బ్రాండ్‌కి..

Viral Video: రోడ్డుపై దొరికిన వంద నోటు.. ఆశగా దాన్ని తీసి చూడగా మైండ్ బ్లాంక్.!
Viral Video
Follow us

|

Updated on: Apr 17, 2024 | 12:45 PM

మనలో క్రియేటివిటీ ఉంటే.. కోట్లలో డబ్బులు పోసి ప్రకటనలు చేయడమెందుకు.. సింపుల్‌గా తక్కువ ఖర్చుతో మన బ్రాండ్‌ను జనాల్లోకి తీసుకెళ్లిపోవచ్చు. సరిగ్గా ఇలాంటి ఆలోచనే ఒకటి చేశాడు ఓ కెఫే ఓనర్. బడా సంస్థల మాదిరిగా ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి తన బ్రాండ్‌కి మార్కెటింగ్, ప్రకటనలు చేయకుండా.. జనాలందరూ కూడా ఒక్క వంద నోటుతో తన కెఫేకు వచ్చేలా ఓ పబ్లిసిటీని ప్లాన్ చేశాడు. అందుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దామా..

ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. రోడ్డుపై ఓ వంద నోటు పడి ఉంది. ఇక దాన్ని ఓ వ్యక్తి దూరం నుంచి చూశాడు. ఎవరికైనా కూడా రోడ్డుపై డబ్బు దొరికితే ఆశ ఉంటుంది కదూ..! అతడు కూడా ఆశగా ఆ వంద నోటు తీసుకున్నాడు. తీరా దాన్ని తీసి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యాడు. ఎందుకంటే ఒకవైపు ఓ కెఫే ప్రకటన.. అందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. అది చూసి తాను మోసపోయినట్టు సదరు వ్యక్తి గ్రహించినా.. ఆ కెఫే ఓనర్ పబ్లిసిటీ ఐడియాను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై లుక్కేయండి.

Latest Articles