Haldi for Dandruff: చుండ్రు సమస్యతో విసుగెత్తిపోయారా.. పసుపుతో చెక్ పెట్టండిలా..

జుట్టుకు సంబంధించిన సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాటిల్లో చుండ్రు సమస్య కూడా ఒకటి. చుండ్రు సమస్య అనేది అంత ఈజీగా తగ్గదు. అంతేకాదు చుండ్రు అనేది ఒకరి నుంచి మరొకరికి కూడా ఈజీగా వచ్చేస్తుంది. తలపై మట్టి, మలినాలు బాగా పేరుకుపోవడం వల్ల చుండ్రు వస్తుంది. చుండ్రు సమస్య ఉన్నవారు ఎప్పటికప్పుడు హెడ్ బాత్ చేస్తూ ఉండాలి. చుండ్రును తగ్గించుకునేందుకు ఎన్నో రకాల షాంపూలు..

Haldi for Dandruff: చుండ్రు సమస్యతో విసుగెత్తిపోయారా.. పసుపుతో చెక్ పెట్టండిలా..
Haldi For Dandruff
Follow us

|

Updated on: May 02, 2024 | 2:14 PM

జుట్టుకు సంబంధించిన సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాటిల్లో చుండ్రు సమస్య కూడా ఒకటి. చుండ్రు సమస్య అనేది అంత ఈజీగా తగ్గదు. అంతేకాదు చుండ్రు అనేది ఒకరి నుంచి మరొకరికి కూడా ఈజీగా వచ్చేస్తుంది. తలపై మట్టి, మలినాలు బాగా పేరుకుపోవడం వల్ల చుండ్రు వస్తుంది. చుండ్రు సమస్య ఉన్నవారు ఎప్పటికప్పుడు హెడ్ బాత్ చేస్తూ ఉండాలి. చుండ్రును తగ్గించుకునేందుకు ఎన్నో రకాల షాంపూలు ఉపయోగించి ఉంటారు. కానీ ఒక్కసారి ఈ చిట్కా ట్రై చేయండి. ఫలితం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది.

పసుపును మనం ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. పసుపుతో జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. పసుపుతో జుట్టు సమస్యల్ని తగ్గించుకోవచ్చన్న విషయం ఎవరికీ తెలిసి ఉండక పోవచ్చు. పసుపులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. దురద, చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతాయి. పసుపు యాంటీ ఫంగల్‌లా పని చేసి.. చుండ్రును దూరం చేస్తుంది. ఇందుకు మీరేంద పెద్ద శ్రమ పడాల్సిన పని లేదు. ఈజీగానే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

షాంపూలో కలపండి..

మీరు ఉపయోగించే షాంపూలో కొద్దిగా పసుపు కలపండి. ఈ మిశ్రమాన్ని తలపై రుద్ది.. స్నానం చేయండి. క్రమంగా చుండ్రు తగ్గిపోతుంది.

ఇవి కూడా చదవండి

కొబ్బరి నూనెతో..

తలకు కొబ్బరినూనె పెట్టుకొనేటప్పుడు అందులో పసుపు పొడి కలపండి. తల స్నానం చేసే అరగంట ముందు జుట్టుకు పట్టించి సున్నితంగా మర్దనా చేయండి ఇలా చేయండి. ఈ రెండు పద్దతుల్లో మీకు ఏది వీలుగా ఉంటే అలా చేయండి. ఇలా చేయడం వల్ల క్రమంగా చుండ్రు తగ్గిపోతుంది. అంతే కాకుండా.. జుట్టు రాలడం తగ్గి, హెయిర్ సాఫ్ట్‌గా తయారవుతుంది. సమ్మర్‌లో ఈ టిప్‌ని మస్ట్‌గా ఉపయోగించండి. మీకు రిలీఫ్ కూడా దొరుకుతుంది.

తలస్నానం తర్వాత..

ఒక కప్పు నీళ్లలో.. ఒక స్పూన్ పసుపు కలిపి పక్కన పెట్టుకోండి. షాంపూతో తలస్నానం చేశాక.. పసుపు నీళ్లను తలకు రాసుకోండి. ఓ అరగంట సేపు ఉంచి.. మళ్లీ తలను శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల కూడా చుండ్రు సమస్య తగ్గుతుంది.

NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..