World Most Venomous Spider: ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన సాలెపురుగుల్లో ఒకటి ఒక వ్యక్తి తన మంచం కింద సంతానోత్పత్తి చేసిందని తెలుసుకుని షాక్ తిన్నాడు. తన గదిలో ఉన్న ఆ స్పైడర్ ని తన కెమెరాలో బంధించి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..
బ్రెజిలియన్ కు చెందిన ఫోటోగ్రాఫర్ గిల్ విజెన్ కు తన రూమ్ లో చిన్న చిన్న సాలెపురుగులు కనిపించాయి. దీంతో అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలని అనుకున్నాడు. దీంతో తన బెడ్ రూమ్ ని వెదకడం ప్రారంభించాడు. అప్పుడు మంచం కింద చూసినప్పుడు.. అతను షాక్ తిన్నాడు. ఎందుకంటే మంచం కింద చిన్న చిన్న సాలెపురుగులతో పాటు.. అర చేతి సైజ్ లో ఉన్న సాలెపుగురును చూశాడు. అది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సాలెపురుగులలో ఒకటని గుర్తించాడు. ఫోటోగ్రాఫర్ అయిన గిల్ విజెన్ వెంటనే తన కెమెరాకు పని చెప్పాడు. తన పిల్లలతో ఉన్న సాలీడుని కెమెరాలో బంధించాడు. ఈ ఫోటో ‘ది స్పైడర్ రూమ్’ పేరుతో అర్బన్ వైల్డ్ లైఫ్ పోటీలకు పంపించాడు. ఈ భారీ సాలెపురుగు ఫోటోకి గాను గిల్ విజెన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
మంచం కింద వేలాది సాలీడ్లు ఉన్నాయి. వాటి పక్కన ఒక అతిపెద్ద సాలెపురుగు విశ్రాంతి తీసుకుంటుంది. దాని శరీరం పొడువు పొడవు 45 మి. మీ అయితే సాలీడుకున్న కాళ్ళు తో కలుపుకుంటే తన అరచేయి అంత ఉందని గిల్ విజన్ తన సోషల్ మీడియాలో చెప్పాడు. బ్రెజిలియన్ లో సంచరించే ఈ సాలెపురుగులను ఆర్మీ స్పైడర్స్ లేదా అరటి సాలెపురుగులు అని అంటారు. ఇవికనుక మనిషులను కరిస్తే.. ముఖ్యంగా చిన్న పిల్లలను కాటు వేస్తే ప్రాణాలకు ప్రమాదం.
Next up is the Urban Wildlife category. Gil Wizen @wizentrop is the winner with this incredible Brazilian wandering spider.
After noticing tiny spiders all over his bedroom, Gil looked under his bed. There, guarding its brood, was one of the world’s most venomous spiders. #WPY57 pic.twitter.com/oFtDxgAO1v— Wildlife Photographer of the Year (@NHM_WPY) October 12, 2021
Also Read: న్యూజెర్సీలో ఘనంగా దసరా ఉత్సవాలు.. ఆడిపాడిన ప్రవాసాంధ్రులు..