Viral Video: ఇరగదిద్దామనుకున్నాడు.. కాళ్లు విరగొట్టుకున్నాడు.. వైరల్ అయిన వీడియో..

విన్యాసాలు చేయడం అనేది ప్రాక్టీస్ లేకుండా చేసే పిల్లల ఆట కాదు. దీనికి చాలా కష్టపడాలి. ఇంతా చేసిన అప్పుడప్పుడు విన్యాసాలు ఫెయిల్ అవుతాయి.

Viral Video: ఇరగదిద్దామనుకున్నాడు.. కాళ్లు విరగొట్టుకున్నాడు.. వైరల్ అయిన వీడియో..
Viral Video

Updated on: Mar 12, 2022 | 7:16 PM

విన్యాసాలు(stunts) చేయడం అనేది ప్రాక్టీస్ లేకుండా చేసే పిల్లల ఆట కాదు. దీనికి చాలా కష్టపడాలి. ఇంతా చేసిన అప్పుడప్పుడు విన్యాసాలు ఫెయిల్ అవుతాయి. అందుకే ఎలాంటి ప్రమాదం జరగకుండా స్టంట్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే కొంత మంది ప్రాక్టీస్ లేక కొద్దిపాటి ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రమాదకరమైన విన్యాసాలు చేసేందుకు వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(social media)లో తరచుగా వైరల్(viral video) అవుతుంటాయి. ఇలాంటి వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ముందూ వెనుకా ఆలోచించకుండా ప్రమాదకరమైన విన్యాసాలు చేసి చివరికి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు.

వీడియోలో మీరు ఇద్దరు వ్యక్తులు ఇంటి పైకప్పుపై నిలబడి ఉన్నారు. అందులో ఒక వ్యక్తి స్టంట్ వేయడానికి ప్రయత్నించాడు. అతను బ్యాక్‌ఫ్లిప్‌ను కొట్టాడు. ఈలోగా అతని బ్యాలెన్స్ కోల్పోయి కిందకు పడిపోయాడు. పైనున్న గోడను పట్టుకోవడానికి ప్రయత్నించినా బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిపోయాడు. దీంతో అతనికి గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియోను parkour_extreme_youtube పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు ఇప్పటివరకు 97 వేల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.

Read Also.. Watch Video: ఎమ్మెల్యేను పొట్టు పొట్టుగా కొట్టిన జనాలు.. సంచలనంగా మారిన వీడియో..