
కల్తీకి కాదేది కానర్హం అనేది ఓ లెక్క.. దొంగతనానికి కూడా కాదేది తక్కువ అన్నట్టు ఉంటుంది ఈ వీడియో చూస్తే. పేపర్ నుంచి పెన్సిల్ వరకు.. ఆయిల్ నుంచి పెట్రోల్ వరకు అన్నింటిని ఈ మధ్యకాలంలో దోచేస్తున్నారు కేటుగాళ్లు. సరిగ్గా అలాంటి ఓ సూపర్ కూల్ దొంగతనం ఇది. మీరూ అందుకు సంబంధించిన వీడియో చూస్తే దెబ్బకు షాక్ అవుతారు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుందని అనుకుంటారు.
వీడియో ప్రకారం.. నన్ బట్టల్లో వచ్చిన ఓ మహిళ.. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి కూల్‌గా దూరి.. చెక్కముక్కను కూలసాగా ఎత్తుకెళ్లిపోతుంది. అయితే ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఏంటంటే.? నన్ బట్టల్లో వచ్చింది మహిళ కాదు.. ఓ వ్యక్తి. సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్‌లో ఇది క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ ఘటన చిలిలోని శాంటియాగోలో మే 7వ తేదీన చోటు చేసుకుంది.
గాబ్రియల్ అనే వ్యక్తి ఇంట్లో ఈ దొంగతనం చోటు చేసుకోగా.. అతడి సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. తన భార్యను పని దగ్గర విడిచిపెట్టి.. ఇంటికి తిరిగి వచ్చాక.. కెమెరాలను చూడగా ఈ దృశ్యాలు కంటబడ్డాయని చెప్పుకొచ్చాడు. ఇక పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. సదరు నిందితుడు విచిత్రమైన దుస్తులు ధరించి అదే ఏరియాలో ఇలాంటి దొంగతనాలు చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడ్ని వెతికే పనిలో పడ్డారు పోలీసులు. లేట్ ఎందుకు ఆ వీడియోపై ఓ లుక్కేయండి.