మన కళ్లు చాలా విషయాల్లో మనల్ని మోసం చేస్తుంటాయి.. దూరంగా ఉండే భూమి.. ఆకాశం కలిసినట్టుగా కనిపిస్తాయి.. అలాగే.. ఎండాకాలంలో ఎండమావులు కూడా నీటిగా కనిపిస్తాయి. ఇక ప్రస్తుతం ఆధునిక కాలంలో టెక్నాలజీ పరంగా అనేక మార్పులు జరిగాయి. కేవలం ప్రకృతి పరంగా మాత్రమే.. మనషులు సృష్టించే వస్తువులు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కేవలం వస్తువులు మాత్రమే కాదండోయ్.. తినే ఆహార పదార్థాలను వస్తువుల ఆకారంలో మార్చారు. ఇందుకు సంబంధించిన వీడియోస్.. ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అదే కోవలోకి చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు.. మరి అదెంటో తెలుసుకుందామా..
ఆ వీడియోలో ముందుగా.. ప్లస్ బాక్స్ కనిపిస్తుంది.. కానీ అది నిజమైనది అనుకుంటే పొరపాటే.. ఆ వెంటనే ఓ కత్తితో దానిని కట్ చేస్తే అసలు విషయం తెలుస్తోంది.. అది కేక్ అని.. అలా.. షూస్.. చీజ్.. పావురం.. ఫుట్ బాల్.. బర్గర్.. షూస్ బాక్స్, సెల్ ఫోన్.. మనిషి కాలు.. ఇలా అనేక రకాలుగా కేక్స్ రెడీ చేశారు.. నిజమైన వస్తువులుగా రెడీ చేశారు.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో రకాల వస్తువులను.. పక్షులను కేక్స్ తో రెడీ చేశారు. చూడటానికి మాత్రం అచ్చం నిజమైన వస్తువుల మాదిరిగా రెడీ చేశారు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: RRR-Ram Charan: మన మధ్య లేడంటే నమ్మాలని లేదు.. ఇక్కడే ఉన్నారనిపిస్తోంది.. రామ్ చరణ్
Samantha: సమంత సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. యశోద షూటింగ్ సెట్స్‌లో..
RRR-Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్.. నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలంటూ..
Knee Pain: మోకాళ్లు.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా ?.. అయితే ఈ ఆకులతో చెక్ పెట్టొచ్చు..