Viral Video: స్మార్ట్‌ఫోన్‌లు ప్రతి మనిషి జీవితానికి కేంద్ర బిందువుగా మారాయంటే అతిశయోక్తి కాదు..ప్రతి ఒక్కరూ తాము చేసే ప్రతి పనిలోనూ సెల్‌ఫోన్ భాగస్వామ్యం ఉండాల్సిందే.. ఇక సెల్‌ఫోన్ చేతిలో ఉందంటే చాలు..ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు దిగాల్సిందే..ఒకప్పుడు సెల్ఫీ అంటే ఏంటో తెలియని జనాలకు.. ఇప్పుడు ఎక్కడ చూసినా సెల్ఫీలతో హోరెత్తిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ఫీ అనేది ఒక భాగమైపోయిందనే చెప్పాలి.. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా అక్కడ ఓ సెల్ఫీ దిగాల్సిందే. ఎంతో ఖరీదైన మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయడం ఒక అందమైన సెల్ఫీ తీసుకోవడం పరిపాటిగా మారింది. అయితే, కొన్ని కొన్ని మధురమైన క్షణాలను సెల్ఫోన్లో బంధించడం మంచిదే కానీ సెల్ఫీ పిచ్చితో చాలా మంది చాలా నష్టపోతుంటారు. ఇలాగే ఇక్కడో వ్యక్తి సెల్ఫీ పిచ్చితో ఏకంగా తన కాస్ట్లీ సెల్‌ఫోన్‌ను కోల్పోవాల్సి వచ్చింది.. అదేంటో.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం…
ఇక్కడ ఒక వ్యక్తి సెల్ఫీలు తీసుకున్న తర్వాత అనుకోకుండా.. తన ఫోన్‌ను నీటిలోకి విసిరేసిన క్షణం ఇది..అదంగా కెమెరాలో రికార్డైంది. ఇలాంటి అబ్సెంట్ మైండెడ్ అనేది సర్వసాధారణం..మనమందరం ఏదో ఒక సమయంలో దాని బారిన పడ్డాము. అయితే, ఇది ఈ వ్యక్తి పొగోట్టుకున్నది చాలా ఖరీదైనది సెల్‌ఫోన్. ఈ ఉల్లాసకరమైన సంఘటన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
— Tansu YEĞEN (@TansuYegen) September 11, 2022
వైరల్ వీడియోలో ఒక వ్యక్తి చేతిలో చేపతో పడవలో ప్రయాణం చేస్తున్నాడు. . చేపను క్యాచ్‌పట్టడంతో అతడు.. సంతోషంగా కనిపిస్తున్నాడు. అదే సంతోషంలో అతడు..వివిధ కోణాల్లో ఆ చేపతో అనేక సెల్ఫీలు తీసుకుంటాడు. అయితే, ఆ వ్యక్తి చేపను తిరిగి నీటిలోకి విసిరేయకుండా, దానికి బదులుగా తన మొబైల్ ఫోన్‌ను విసిరాడు. ఫోన్‌ని నీళ్లలో పడేయగానే తను ఏం చేశాడో అర్థమైంది. తేరుకున్న తర్వాత తన ఫోన్ కోసం ప్రయత్నిస్తాడు..కానీ, పాపం అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది…తరచుగా ఉల్లాసకరమైన వీడియోలను పోస్ట్ చేసే తన్సు యెగెన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి