AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సరదాగా హైకింగ్‌కు వెళ్లి తిరిగొచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ఓ ఫోటో చూడగా మైండ్ బ్లాంక్

సరదాగా హైకింగ్‌కి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు.. అక్కడ తీపి గుర్తులు చెరిగిపోకుండా ఉండేందుకు ఫోటోలు దిగారు. ఇక అందులో వారు ఓ ఫోటో చూడగానే దెబ్బకు షాక్ అయ్యారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ ఫోటోలో ఎవరున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..

Viral Video: సరదాగా హైకింగ్‌కు వెళ్లి తిరిగొచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ఓ ఫోటో చూడగా మైండ్ బ్లాంక్
Viral News
Ravi Kiran
|

Updated on: May 27, 2025 | 6:29 PM

Share

వరుసగా ఐదారు రోజులు సెలవులు దొరికితే మనం సొంతూళ్లకు ఎలా ప్రయాణం అవుతామో.. విదేశాల్లో కూడా లాంగ్ లీవ్స్ దొరికినప్పుడు ఏదైనా నేచర్‌ను ఆస్వాదించేందుకు అలా హైకింగ్‌కి, ఫిషింగ్‌కి వెళ్తుంటారు. సరిగ్గా ఇలానే ఇద్దరు వ్యక్తులు హైకింగ్‌కి అమెరికాలోని గెట్టిస్‌బర్గ్‌లోని డెవిల్స్ డెన్‌కు వెళ్లారు. ఇక వారు అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేసి.. ఎంచక్కా తమ తీపిగుర్తులను ఫోటోలుగా తీసుకుని ఇంటికొచ్చారు. ఇక ఓసారి ఆల్బమ్ తిరగేస్తే.. దెబ్బకు ఓ ఫోటో చూసి షాక్ అయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. గెట్టిస్‌బర్గ్‌లోని డెవిల్స్ డెన్‌కు విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. అసాధారణమైన చరిత్ర, అలాగే భయంకరమైన నిశ్శబ్దానికి కేరాఫ్‌గా నిలిచే.. ఈ డెవిల్స్ డెన్‌లో మర్మమైన ఎన్నో విషయాలు చోటు చేసుకుంటాయని స్థానికంగా చెబుతుంటారు. ఇక డెవిల్స్ డెన్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేసిన ఆ ఇద్దరు వ్యక్తులు.. తమ తీపిగుర్తులను మర్చిపోకుండా ఉండేందుకు ఓ ఫోటో దిగారు. ఆ సమయంలో అక్కడ వారిద్దరూ తప్ప మరెవ్వరూ లేరు. అయితే ఇంటికెళ్లి ఓసారి దిగిన ఫోటోలను తిరగేసినప్పుడు.. వారి పక్కనే ఏదో వింతగా కనిపించింది. ఆ ఫోటోలో ఓ మర్మమైన వ్యక్తిని మీరు స్పష్టంగా చూడవచ్చు. పాత యాత్రికుల దుస్తులను ధరించి కనిపిస్తాడు. ఇక్కడ ఇంకా భయంకరమైన విషయమేమిటంటే.. అతడు వెనక్కి తిరిగి.. వెనక్కి నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక ప్రస్తుతానికి అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. అది పురాతన కాలంలో చిక్కుకుని.. తప్పిపోయిన ఆత్మ కావచ్చునని, దెయ్యం అయ్యి ఉండొచ్చునని.. ఇలా ఎవరికి తోచింది వారు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి