Viral Video: ఓరీ దేవుడో ఇదెక్కడి ఆచారం భయ్యా.. పెళ్లి కొడుకు తలమీద కొబ్బరి బొండాలు పగలకొడుతూ..

కొంత మంది ఆచారాలు, పద్దతులు చూసేందుకు వింతగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో వరుడి ఊరేగింపు వేడుకగా జరుగుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో వధువు ఎంట్రీ వెరైటీగా ఉంటుంది. ఇలా పెళ్లి వేడుకలు, వింతలు, విడ్డూరాలకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌ను షేక్‌ చేస్తోంది.

Viral Video: ఓరీ దేవుడో ఇదెక్కడి ఆచారం భయ్యా.. పెళ్లి కొడుకు తలమీద కొబ్బరి బొండాలు పగలకొడుతూ..
Coconut On Mans Head Video

Updated on: May 02, 2025 | 12:12 PM

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రాంతాల వారిగా పెళ్లిళ్లలో రకరకాల సంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తుంటారు. కొంత మంది ఆచారాలు, పద్దతులు చూసేందుకు వింతగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో వరుడి ఊరేగింపు వేడుకగా జరుగుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో వధువు ఎంట్రీ వెరైటీగా ఉంటుంది. ఇలా పెళ్లి వేడుకలు, వింతలు, విడ్డూరాలకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌ను షేక్‌ చేస్తోంది.

ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో వివాహ వేడుక కనిపిస్తుంది. అయితే, మండపంలో ఒక వ్యక్తి వరుడి వస్త్రధారణలో ఉన్న వ్యక్తి తల మీద కొబ్బరి బొండంను పగలగొడుతున్నాడు. కొబ్బరికాయతో అదేపనిగా వరుడి తలపై కొడుతున్నాడు. అతను కూడా ఏమాత్రం రియాక్ట్ అవకుండా అలాగే కూర్చుని ఉన్నాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి ఆ కొబ్బరి బొండంతో పదే పదే కొడుతూనే ఉన్నాడు. ఆ కొట్టించుకుంటున్న వ్యక్తి కూడా కళ్లు మూసుకుని ఏదో మసాజ్ చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నాడు కాబోలు.. కదలకుండా ఉన్నాడు.. కానీ, చివరకు అతడు ముందుకు వంగాడు.. ఇదంతా ఆపేయాలన్నాడో ఏమో తెలియదు గానీ వీడియో అంతటితో ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

కాగా, ఈ షాకింగ్‌ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఓరెయ్ .. ఇదేక్కడి వింత ఆచారంరా సామీ.. పెళ్లి కాదు.. ముందు తలపగిలి చాస్తవ్‌ అంటూ ఫన్నీగా రియాక్ట్‌ అవుతుండగా, మరికొందరు ఈ పెళ్లి నీ చావుకే వచ్చిందంటూ వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..