ఎవర్రా అయ్యా నువ్వు..! జడ్జికి కూడా ఝలక్ ఇచ్చావ్‌గా.. వర్చువల్‌గా విచారణకు హాజరవమంటే.. ఏం చేశాడో చూడండి!

హైకోర్టులో కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా ఓ వ్యక్తి వర్చువల్‌గా హాజరైన తీరు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వర్చువల్‌గా హాజరుకావడంలో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారు. అయితే అతను టయిలెట్‌లో ఉండి ఆన్‌లైన్‌లో న్యాయమూర్తి ముందు విచారణకు హాజరయ్యాడు. జూన్ 20న జస్టిస్ నిర్జార్ ఎస్ దేశాయ్ బెంచ్ ముందు ఈ సంఘటన జరిగ్గా..తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎవర్రా అయ్యా నువ్వు..! జడ్జికి కూడా ఝలక్ ఇచ్చావ్‌గా.. వర్చువల్‌గా విచారణకు హాజరవమంటే.. ఏం చేశాడో చూడండి!
Viral Video

Updated on: Jun 27, 2025 | 6:57 PM

గుజరాత్ హైకోర్టులో తన కేసు విచారణ సందర్భంగా ఓ యువకుడు టాయిలెట్‌లో కూర్చొని హాజరుకావడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన జూన్ 20న జస్టిస్ నిర్జార్ ఎస్ దేశాయ్ ధర్మాసనం ముందు జరిగింది. ‘సమద్ బ్యాటరీ’గా పేరుతో లాగిన్ అయిన వ్యక్తి వర్చువల్‌ విచారణ లైవ్‌లో టాయిలెట్‌లో ఉండి తనను తాను శుభ్రం చేసుకుంటున్న దృశ్యాలు కెమెరాలో కనిపించాయి. కోర్టు రికార్డుల ప్రకారం, ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రతివాదులతో పాటు సదురు వ్యక్తి కూడా ఆన్‌లైన్‌లో విచారణకు హజర్యాడు.

అయితే వర్చువల్‌గా విచారణకు హాజరైన వ్యక్తి లైవ్‌లో టాయిలెట్‌లో మలవిసర్జన చేస్తూ కనిపించాడు. వీడియో మొదట్లో అతనకు మెడలో బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు వేసుకొని ఉన్నట్టు కనిపించగా..ఆ తర్వాత అతను తన ఫోన్‌ను సరిచేసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే అప్పుడు అతను టాయిలెట్‌లో కూర్చున్నట్లు స్పష్టంగా కనిపించింది. టాయిలెట్‌లో ఉన్న అతను తనను తాను శుభ్రం చేసుకుని, అక్కడి నుంచి బయటకు వెళ్లి మరో రూమ్‌లోకి వెళ్లడం కూడా ఆ వీడియోలో కనిపిందిచింది. అయితే ఈ వ్యక్తి తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే వర్చువల్‌గా కోర్టు గదుల్లో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి ఏం కాదు. గత ఏప్రిల్‌ నెలలో కూడా ఓ వ్యక్తి ఇలానే వీడియో కాన్ఫరెన్స్‌లో ధూమపానం చేస్తూ కనిపించాడు. దీంతో అతనికి గుజరాత్ హైకోర్టు రూ. 50,000 జరిమానా విధించింది. అదేవిధంగా, మార్చిలో, ఇలా ప్రవర్తించిన ఓ న్యాయవాదికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..