Viral: డబ్బులు అవసరమై ఏటీఎంకెళ్లిన మహిళ.. బ్యాలెన్స్ చెక్ చేయగా కళ్లు బైర్లు.!

|

Dec 07, 2023 | 6:40 PM

ఓ మహిళ మానవ వనరుల సంస్థలో ఉద్యోగం చేస్తోంది. నెలకు లక్షల్లో శాలరీ వస్తోంది. ఇటీవల ఆమె డబ్బులు అవసరమై ఏటీఎంకి వెళ్లగా.. తన ఖాతాలో బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేసింది. ఇక స్క్రీన్‌పై కనిపించిన నెంబర్ చూసి దెబ్బకు సదరు మహిళ కళ్లు గిర్రున తిరిగాయ్. ఆ తర్వాత జరిగినది.. ఆమెకు మరింత షాక్‌కు గురి చేసింది.

Viral: డబ్బులు అవసరమై ఏటీఎంకెళ్లిన మహిళ.. బ్యాలెన్స్ చెక్ చేయగా కళ్లు బైర్లు.!
Representative Image
Follow us on

ఓ మహిళ మానవ వనరుల సంస్థలో ఉద్యోగం చేస్తోంది. నెలకు లక్షల్లో శాలరీ వస్తోంది. ఇటీవల ఆమె డబ్బులు అవసరమై ఏటీఎంకి వెళ్లగా.. తన ఖాతాలో బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేసింది. ఇక స్క్రీన్‌పై కనిపించిన నెంబర్ చూసి దెబ్బకు సదరు మహిళ కళ్లు గిర్రున తిరిగాయ్. ఆ తర్వాత జరిగినది.. ఆమెకు మరింత షాక్‌కు గురి చేసింది. ఇంతకీ అసలేం జరిగింది.? ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందో.. ఇప్పుడు తెలుసుకుందామా..!

వివరాల్లోకి వెళ్తే.. మలేసియాకు చెందిన హఫీదా అబ్దుల్లా అనే మహిళ స్థానికంగా మానవ వనరుల సంస్థలో పని చేస్తోంది. నెలకు రూ. లక్షన్నర.. ఏడాదికి రూ. 18 లక్షలు సంపాదిస్తోంది. ఇక నాలుగు రోజుల క్రితం కొంచెం డబ్బులు అవసరమై.. ఆమె తన బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోగా.. అక్కడ కనిపించిన బ్యాలెన్స్ చూసి దెబ్బకు షాకైంది. ఎందుకంటే.. అందులో ఆమెకు అందులో ఏకంగా 86.3 మిలియన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో రూ. 718 కోట్లు) ఉన్నట్టు తేలింది. ఆమెకు ఆ డబ్బు చూడగానే.. ఇదంతా ఓ కల మాదిరిగానే అనిపించింది. దాన్ని యాక్సెస్ చేయాలని అనుకుంది.. కానీ.! ఆమెకు ఎలాంటి ఉపయోగం లేకపోలేదు. మలేషియాలోని అతిపెద్ద బ్యాంకైన ‘మే బ్యాంక్’ కస్టమర్ సదరు మహిళ. రాత్రికి రాత్రే తన బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లకు ఎగబాకడంతో.. దెబ్బకు ఆమె ఫ్యూజులు ఎగిరిపోయాయి. కానీ ఏదొక బ్యాంకింగ్ తప్పిదం వల్ల ఆ ఖాతాను యాక్సెస్ చేయలేకపోయింది హఫీదా. చివరికి ఆమెకు కలిగిన ఈ చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకుంది సదరు మహిళ.

‘ప్రియమైన మే బ్యాంక్.. నా బ్యాంకింగ్ అనుభవాన్ని మరుపురానిదిగా మార్చినందుకు కృతజ్ఞతలు. డబ్బుతో ఆనందాన్ని కొనలేం అని అంటారు.. నిరాశను మాత్రం ఎలా కొనాలో మే బ్యాంక్ వారికి తెలుసు’ అని హఫీదా రెడ్డిట్ ద్వారా పేర్కొంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.(Link)