Anand Mahindra: భారతీయుల అల్పాహారంపై ఆనంద్ మహీంద్ర ఫన్నీ ట్వీట్.. లైక్స్, రీ ట్వీట్లతో హోరెత్తుతున్న సోషల్‌ మీడియా..

|

Sep 22, 2021 | 9:48 AM

Anand Mahindra Funny Tweet: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా..

Anand Mahindra: భారతీయుల అల్పాహారంపై ఆనంద్ మహీంద్ర ఫన్నీ ట్వీట్.. లైక్స్, రీ ట్వీట్లతో హోరెత్తుతున్న సోషల్‌ మీడియా..
Mahindra
Follow us on

Anand Mahindra Funny Tweet: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా.. ఆయన తన ఆలోచనలను ఎప్పుడూ ప్రజలతో పంచుకుంటారు. ఆయన అనుచరులు కూడా కామెంట్లతో తెగ వైరల్ చేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహేంద్ర కెల్లాగ్ ఉప్మా గురించి ఓ పాత కథనాన్ని పంచుకున్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

అమెరికన్ కంపెనీ కెల్లోగ్ భారతదేశానికి వచ్చినప్పుడు భారతీయుల అల్పాహార అలవాట్లను మారుస్తామని సవాల్ చేసిందట. అయితే, భారతీయుల అల్పాహార అలవాట్లు మారలేదు కానీ, కెల్లాగ్స్ తన ఆహార ఉత్పత్తిని మాత్రం మార్చాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మీమ్‌ను ఆనంద్‌ మహీంద్రా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘అమెరికాకు చెందిన కెల్లోగ్స్ కంపెనీ వారు భారతదేశానికి వచ్చారు. భారతీయుల అల్పాహారం, అలవాట్లను పూర్తిగా మార్చుతామంటూ సవాలు చేశారు. కానీ, 10 సంవత్సరాల్లో కెల్లోగ్సే మారిపోయింది” అంటూ రాసుకొచ్చారు. ఇప్పడు ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వందల సంఖ్యలో రీ ట్వీట్‌లు చేస్తున్నారు. 12 వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి. మా ఆహార అలవాట్లను ఎవరూ మార్చలేరంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మా అల్పాహారాలకు మరేవీ సాటిరావంటున్నారు.

Anand Mahindra Tweet:

Also read:

Viral Video: గాఢ నిద్రలో పిల్ల ఏనుగు.. తల్లడిల్లిన తల్లి ఏంచేసిందంటే..! వీడియో

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోరం.. వ్యవసాయ బావిలో పడ్డ ఏడేళ్ల బాలుడు

Viral Video: అబ్బురపరుస్తున్న గాడిదల రేస్‌.. డాంకీ పవర్‌కు షాకవుతున్న నెటిజన్లు.. వీడియో