ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. చాలామంది తమలోని ప్రతిభను వెలికితీస్తున్నారు. కొందరు స్టంట్స్.. మరికొందరు డ్యాన్స్ మూమెంట్స్‌తో ఫ్లోర్ దద్దరిల్లిపోయేలా చేస్తుంటే.. ఇంకొందరు ఫుడ్‌పై రకరకాల ప్రయోగాలు చేస్తూ.. వాటికి వింత వింత పేర్లు పెట్టి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఒరియో బిస్కెట్ల(Oreo)తో బజ్జీలు.. పానీపూరితో ఐస్ క్రీమ్.. మ్యాగీ(Maggi)తో షరబత్ అంటూ తయారు చేసిన చిత్ర విచిత్రమైన వంటకాలను మీరు చూసే ఉంటారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వింత రెసిపీని తయారు చేశాడు స్ట్రీట్ ఫుడ్ విక్రేత(Street Food Vendor). దాన్ని చూస్తే మీరు కూడా షాక్ కావడం ఖాయం.
సాధారణంగా మ్యాగీ అంటే ఎవరికి ఇష్టముండదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ మ్యాగీ. ఆఫీస్‌కు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్ధులు 2 మినిట్స్‌లో తయారయ్యే ఈ మ్యాగీని ఆవురావురుమంటూ తింటారు. అలాంటి మ్యాగీతో పరోటా చేశాడు ఓ వ్యక్తి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఆ స్ట్రీట్ ఫుడ్ విక్రేత ముందుగా నోరూరించే మ్యాగీని సిద్దం చేసి.. ఆ తర్వాత దాన్ని పిండిలో స్టఫ్ చేస్తాడు. ఇక ఆ పిండిని పరోటాలా చేసి వెన్నతో పాన్‌పై హీట్ చేస్తాడు. అనంతరం పరోటా రెడీ అయ్యాక కస్టమర్‌కు చట్నీ, కర్రీతో ఈ వింత వంటకాన్ని సర్వ్ చేస్తాడు. ఈ వంటను చూసి మ్యాగీ ప్రేమికులు లబోదిబోమంటున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ‘దీన్ని చూసిన తర్వాత నెస్లే కంపెనీ మ్యాగీ తయారీని నిలిపేస్తుందని’ ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇది చూశాక భోజన ప్రియులు కోమాలోకి వెళ్లడం ఖాయం అని మరొకరు రాసుకొచ్చారు.
Also Read: ఈ అలవాటు మీకు ఉన్నట్లయితే.. వెంటనే మానేయండి.. లేదంటే అంతే సంగతులు!