Lulu Mall: వామ్మో.. లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌ కంగుతిన్నాడు..! తీరా చూస్తే కదులుతున్న పురుగులు..

|

Mar 29, 2024 | 7:15 PM

లులు మాల్‌కి ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు షాపింగ్‌ చేయడానికి, భోజనాల కోసం, పర్యాటకం కోసం వస్తుంటారు. అలాంటి మాల్‌లో ఇంత భయంకర సంఘటన జరగటంతో కస్టమర్లు కంగుతిన్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై కొందరు యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా

Lulu Mall: వామ్మో.. లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌ కంగుతిన్నాడు..! తీరా చూస్తే కదులుతున్న పురుగులు..
Lulu Mall Viral Video
Follow us on

వేసవిలో ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ లో పురుగు కనిపించిందంటూ ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌ లక్నోలోని లులు మాల్‌కి చెందినదిగా తెలిసింది. యూపీలోని లక్నోలో గల లులు మాల్‌లోని ‘ఫలూదా నేషన్’ కుల్ఫీలో క్రిములు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఒక కస్టమర్ దాని వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, కస్టమర్ కుల్ఫీలో ఉన్న పురుగును దుకాణదారునికి చూపిస్తున్నాడు. పురుగును చూపించిన తర్వాత.. షాప్‌ సిబ్బంది మరో కుల్ఫీ ఇస్తానని చెప్పడంతో వినియోగదారుడు నిరాకరించాడు. ఆ తరువాత దుకాణదారుడు కస్టమర్‌ కొన్న కుల్ఫీకి సంబంధించిన మొత్తం డబ్బును వాపసు చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కానీ, లులు మాల్‌లో నాణ్యత లేని ఆహారం సప్లై చేస్తారనే ఆరోపణలు, సంఘటనల్లో ఇది మొదటి కాదు. మాల్‌లో నాణ్యత లేని ఆహారం గురించి ఇప్పటికే చాలా ఫిర్యాదులున్నాయి. పలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ వైరల్ వీడియోపై యూజర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

లక్నోలోని లులు మాల్‌కి ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు షాపింగ్‌ చేయడానికి, భోజనాల కోసం, పర్యాటకం కోసం వస్తుంటారు. అలాంటి మాల్‌లో ఇంత భయంకర సంఘటన జరగటంతో కస్టమర్లు కంగుతిన్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై కొందరు యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, ‘ఇది చిన్న విషయం కాదు.’ ఈ సంఘటనపై డిపార్ట్‌మెంట్ చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…