Viral News: మెట్రో ప్రయాణికులను ముప్పు తిప్పలు పెట్టిన కోతులు.. అదిరిపోయే ఐడియాతో చెక్‌ పెట్టిన అధికారులు..

|

Nov 01, 2021 | 8:52 AM

Viral News: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో పట్టణంలో ఉన్న మెట్రో స్టేషన్‌కు గతకొన్ని రోజుల క్రితం ప్రయాణికులు వెళ్లాలంటే భయం భయంతో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కారణం కోతుల బెడద. స్టేషన్‌కు వచ్చిన..

Viral News: మెట్రో ప్రయాణికులను ముప్పు తిప్పలు పెట్టిన కోతులు.. అదిరిపోయే ఐడియాతో చెక్‌ పెట్టిన అధికారులు..
Monkeys At Lucknow Metro
Follow us on

Viral News:  ఉత్తరప్రదేశ్‌లోని లక్నో పట్టణంలో ఉన్న మెట్రో స్టేషన్‌కు గతకొన్ని రోజుల క్రితం ప్రయాణికులు వెళ్లాలంటే భయం భయంతో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కారణం కోతుల బెడద. స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులపై కోతులు దాడులకు దిగడం నిత్యకృత్యంగా మారింది. దీంతో మెట్రో వైపు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. చాలా మంది ఈ కోతుల బెడదకు భయపడి అసలు మెట్రోను ఉపయోగించుకోవడం కూడా మానేశారు. దీంతో ఎలాగైనా ఈ కోతుల బెడదను తప్పించాలని అధికారులు తీవ్ర ఆలోచనలు చేశారు. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా కోతులను మాత్రం తరిమకొట్టలేకపోయారు.

అయితే ఇదే సమయంలో వారికి ఒక ఆలోచన వచ్చింది. కోతులు సహజంగా కొండముచ్చులకు భయపడతాయనే విషయం మనందరికీ తెలిసిందే. దీనినే ప్రాతిపదికన తీసుకున్న అధికారులు పక్కా ప్లాన్‌ వేశారు. మెట్రో స్టేషన్‌ ఆవరణలో కొండ ముచ్చు అరుస్తున్నట్లు ఉన్న ఆడియోను ప్లే చేశారు. అయితే ఈ ఐడియా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో మరో ఆలోచన చేసిన అధికారులు ఈసారి ఏకంగా కొండముచ్చులను పోలిన కటౌట్‌లోను మెట్రో స్టేషన్‌లో అక్కడక్కడ ఏర్పాటు చేశారు.

ఈ కటౌట్‌లకు ఆడియో కూడా తోడవడంతో.. మొన్నటి వరకు మనుషులను భయపెట్టించిన కోతులే ఇప్పుడు భయపడే పరిస్థితి వచ్చింది. పట్టణంలోని 9 మెట్రోస్టేషన్‌లలో ఇలాంటి కటౌట్‌లను ఏర్పాటు చేశారు. మెట్రోకు ఆదాయం తగ్గడానికి కారణమైన కోతుల బాధను తప్పించుకోవడానికి అధికారులు చేసిన ఆలోచన నిజంగానే సూపర్‌ కదూ!

Also Read: Crime News: టిక్‌టాక్ స్టార్స్ అవిభక్త సోదరుల మృతి.. అకాల మరణం పట్ల ఎన్నో అనుమానాలు..!

PM Modi: బ్రిటన్ చేరుకున్న భారత ప్రధాని మోడీ.. గ్లాస్కోలో ప్రవాసీల ఘన స్వాగతం

PM Modi: బ్రిటన్ చేరుకున్న భారత ప్రధాని మోడీ.. గ్లాస్కోలో ప్రవాసీల ఘన స్వాగతం