
ప్రేమ గుడ్డిది అనేది నిజమే. కానీ ప్రేమలో ఉన్నవారు మాత్రం కాస్త హద్దులు దాటేస్తున్నారు. అవునండీ.! కొంతమంది ప్రేమికులు బస్సులు, రైళ్లు, మెట్రోలు, పార్కులు మొదలైన బహిరంగ ప్రదేశాలలో ముద్దులాటలాడేస్తున్నారు. ఆ కంటెంట్‌తోనే తరచూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నారు. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇందులో ఓ ప్రేమ జంట ఏం చేస్తుందో చూస్తే.. మీకు కూడా ఒళ్లు మండిపోవడం ఖాయం. ఈ ఘటన బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగింది. ఆ పార్క్ ఏంటి అన్నది మాత్రం తెలియదు.
ఇది చదవండి: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ పార్క్‌లో ఇద్దరు లవర్స్ గాడమైన ప్రేమలో మునిగి తేలుతున్నారు. పక్కన జనాలు ఉన్నారని సోయి కూడా లేదు. ఇద్దరు కూడా ఒక బెంచ్ మీద కూర్చుని లోకం మర్చిపోయి మరీ రొమాన్స్ చేస్తూ అదర చుంబన ఇచ్చుకుంటున్నారు. కొంతమంది ప్రజలు ఆ పక్కన పార్క్‌లో నడుస్తున్నట్టు, పిల్లలు ఆడుకుంటున్నట్టు దృశ్యాలు చూడవచ్చు. మరి ఇలా జనాలు తిరుగుతున్న చోటు.. ఇలాంటి గలీజు పనులు చేయొచ్చా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో అక్కడున్న వారిలో ఒకరు రికార్డు చేయగా.. అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చి పడ్డాయి. ‘వారిని అక్కడి నుండి బయటకు పంపించి ఓయోకు వెళ్లమని చెప్పాలి ‘ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘లవర్ వద్ద డబ్బు లేనట్లు ఉంది, అందుకే ఇలా చేస్తున్నారు’ అని ఇంకొకరు సైటైరికల్ కామెంట్ చేశారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ లుక్కేయండి.
ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా