సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతాయి. వాటిల్లో కొన్ని ఫన్నీ సీన్స్ అయితే, మరికొన్ని మనసును హత్తుకునేలా కనిపిస్తాయి. వాటిని చూసి హృదయం సంతోషిస్తుంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అందులో ఒక పిల్లవాడు ‘ప్రపంచంలోని అతి చిన్న పక్షికి’ ధాన్యం తినిపిస్తున్న దృశ్యం నెటిజన్లను కట్టిపడేస్తోంది. పసి పిల్లల హృదయం స్వచ్ఛంగా ఉంటుందన్నారు. ఏం చేసినా చిత్తశుద్ధితో చేస్తారు. వీడియోలో కూడా అలాంటిదే కనిపిస్తోంది. పక్షులకు ఆహారం ఇస్తున్నప్పుడు పిల్లవాడు చాలా ఎంతో సంతోషంగా కనిపిస్తాడు.
వీడియోలో..ఓ పిల్లవాడు తన ఇంటి రెయిలింగ్‌పై కూర్చుని ఉన్నాడు. తన చేతిలో చిన్న గిన్నె లాంటిదాన్ని పట్టుకున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు, అందులో పక్షులకు కావాల్సిన గింజలు ఉన్నాయి. అంతలోనే పక్షులు ఎగురుతూ వచ్చి అతని చేతిపై కూర్చుని ఆనందంగా ఆ ధాన్యం గింజలు తినడం ప్రారంభించాయి.. అయితే ధాన్యాన్ని ఎవరు ముందు తింటారనే విషయంలో కూడా ఒకరితో ఒకరు గొడవ పడుతున్నట్టుగా కనిపిస్తుంది ఆ వీడియోలో. ప్రపంచంలోని అతి చిన్న పక్షులుగా పరిగణించబడే ఈ పక్షులు ‘హమ్మింగ్‌బర్డ్స్’ అని వీడియో క్యాప్షన్‌లో చెప్పబడింది.
కేవలం 18 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ప్రజలు ఇష్టపడుతున్నారు. హృదయాన్ని హత్తుకునే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు 1 మిలియన్ కంటే ఎక్కువ అంటే 10 లక్షల కంటే ఎక్కువ సార్లు వీక్షించబడింది.
Feeding the hummingbirds.. ? pic.twitter.com/klRzSKwKjG
— Buitengebieden (@buitengebieden) June 23, 2022
అయితే, హమ్మింగ్ బర్డ్స్ సాధారణంగా 2-2.5 అంగుళాల పొడవు ఉంటాయి. కానీ కొన్ని 8 అంగుళాల పొడవు, వాటి బరువు రెండు గ్రాముల నుండి 20 గ్రాముల వరకు ఉంటుంది.
ఇకపోతే, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ఆ బిడ్డ ఎంత అదృష్టవంతుడో అంటూ ఒకరు కామెంట్ చేస్తే..ఇది కల కాదుకదా అంటున్నారు మరికొందరు. ‘హమ్మింగ్‌బర్డ్స్ చాలా అందంగా ఉన్నాయి … ఈ చిన్న పిల్లవాడి క్యూట్‌నెస్ చూడండి మరింత అందంగా ఉంది..అంటూ మరొక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ రాశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి