కుక్క, పిల్లి, చిలుక.. ఇలా కొన్ని సాధు జంతువుల లాంటి వాటిని కొందరు పెంచుకుంటూ ఉంటారు. అయితే మన దేశంలో కాదు గానీ.. విదేశాల్లో పులులు, మొసళ్లు, పాములు లాంటి వాటిని కూడా పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. ఇదిలా ఉంటే.. ప్రపంచంలో ఉన్న ఏ జీవి అయినా కూడా తన ప్రాణాలకు ముప్పు ఉంటేనే.. ఇతర జీవులపై దాడి చేస్తాయి. పాములు కూడా అంతే!.. అయితే పాముల్లో కొన్ని జాతులు ఉంటాయి. వాటికి చాలా దూరంగా ఉండాలి. అవి ఒక్క కాటుకే చంపేస్తాయి. అయితే ఇక్కడ ఓ చిన్నారి మాత్రం పాము అంటేనే అస్సలు భయపడట్లేదు. దాన్ని కౌగలించుకుని దిండులా వాడుతోంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ 10 ఏళ్ల చిన్నారి భారీ కొండచిలువను తన పెంపుడు జంతువుగా భావిస్తున్నట్లు మీరు చూడవచ్చు. బంగారు వర్ణంలా ఉన్న ఆ కొండచిలువను గట్టిగా హాగ్ చేసుకుని ఆ చిన్నారి ప్రశాంతంగా పడుకుంది. ఆ వీడియోను ఎవరో వ్యక్తి తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
కాగా, ‘snakemasterexotics’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఈ వీడియోను అప్‌లోడ్ చేయగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు. ‘ఈ చిన్నారికి అస్సలు భయం లేదంటూ’ రాసుకొచ్చారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..