శీతాకాలం వచ్చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకుంటున్నాయి. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. చాలా చోట్ల చలికి ఇళ్లలోనుంచి బయటకు కూడా రావడం లేదు కొంతమంది. మనుషులైతే ఇళ్లలో తలుపులేసుకొని ఉంటారు కానీ పశుపక్షాదులు. అవి చలి వణకాల్సిందే, వానకు తడవాల్సిందే.. ఎండకు ఎండాల్సిందే. అయితే కొంతమంది జంతు ప్రేమికులు వాటికి గూడు కలిపిస్తూ.. జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. తాజాగా వైరల్ అవుతోన్న వీడియో కూడా అలాంటిదే.. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది. వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఓ చిన్న పిల్లడు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఈ చిన్న పిల్లవాడు చలిమంట ముందు కూర్చున్నాడు. మేక పిల్లను తన ఒడిలో పెట్టుకుని ఉన్నాడు. తాను చలికాచుకుంటూ ఆ మేకపిల్లను కూడా తన చేతులతో ఆ వేడిని అందిస్తున్నాడు. ఈ వీడియోను 15,000 మందికి పైగా చూశారు. ఈ వీడియో చూస్తుంటే మనసుకు హాయిగా నిపిస్తుంది. ఎంతో అంకితభావంతో, ప్రేమతో, శ్రద్ధతో ఈ చిన్నారి తన మేకపిల్లను చూసుకుంటున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఆ వెచ్చదనానికి మేకపిల్ల కూడా అతని ఒడిలో హాయిగా పడుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ठंड सबको लगती है ?❤️ pic.twitter.com/2mwYSWJwVh
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 4, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..