Viral News: మరికాసేపట్లో పెళ్లి.. ముక్కు నచ్చలేదంటూ పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు..
ప్రతీ మనిషి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జీవితంలో ఒకేసారి చేసుకోవాలని కోరుకునే ఏకైక వేడుక వివాహమే. అందుకే తమకు నచ్చిన వారితో ఏడడుగులు వేయాలని ఎంతో ఆశపపడుతుంటారు. అందుకు అనుగుణంగా ఒకటికి రెండు సార్లు చూసుకొని మరీ తమ..

ప్రతీ మనిషి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జీవితంలో ఒకేసారి చేసుకోవాలని కోరుకునే ఏకైక వేడుక వివాహమే. అందుకే తమకు నచ్చిన వారితో ఏడడుగులు వేయాలని ఎంతో ఆశపపడుతుంటారు. అందుకు అనుగుణంగా ఒకటికి రెండు సార్లు చూసుకొని మరీ తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటారు. వివాహానికి ముందే పాట్నర్ నచ్చితేనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇక పెళ్లికి నిరాకరించడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఎత్తు, రంగు, ఉద్యోగం ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా పెద్దదిగానే ఉటుంది. అయితే ఓ వధువు మాత్రం వరుడి ముక్కు చిన్నగా ఉందని పెళ్లికి నిరాకరించింది.
ఈ వింత సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సంభాల్ జిల్లాలోని అస్మోలీ అనే ప్రాంతానికి చెందిన యువతికి, యువకుడితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ఇద్దరూ ఓకే అనుకున్నారు, ఇరు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక అంతలోనే వరుడి కుటుంబం వధువు ఇంటికి బుధవారం ఊరేగింపుగా వచ్చింది. దీంతో అమ్మాయి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. అయితే ఇదే సమయంలో వేడుకకు వచ్చిన కొందరు మహిళలు వరుడి ముక్కు చిన్నగా ఉందని గుసగుసలాడుకున్నారు.
దీంతో ఈ విషయం కాస్త పెళ్లి కూతురు చెవిలో పడింది. దీంతో అంతకు ముందు పెళ్లికి ఓకే చెప్పిన వధువు.. మరోసారి అతడిని చూసేందుకు వెళ్లింది. నిజంగానే ముక్కు చిన్నగా ఉందని నేను అతన్ని పెళ్లి చేసుకోనని కరాకండిగా చెప్పేసింది. దీంతో వేడుకకు హాజరైన వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. కుటంబ సభ్యులు, గ్రామ పెద్దలు వధువును తన నిర్ణయాన్ని మార్చుకోమని ఎంతగానో ప్రయత్నించారు. అయితే ఆమె మాత్రం నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో చేసేదేమి లేక వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..



