Watch Video: గ్రేట్‌రా తమ్ముడూ..! వయసు చిన్నదే కానీ మనసు గొప్పది.. వీధి కుక్కల కోసం ఆ యువకుడు ఏం చేశాడంటే..?

|

Mar 27, 2023 | 11:32 AM

కొందరు వీధిన పోయే కుక్కలకు కూడా కావాలని రాళ్లు వేయడం, కొట్టడం వంటివి చేస్తూ మూగజీవాలపై క్రూరంగా ప్రవర్తిస్తారు. ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకునేవారు కూడా వీధి కుక్కల విషయంలో దయ లేకుండా ప్రవర్తించడం ఇంకా బాధకరమైన

Watch Video: గ్రేట్‌రా తమ్ముడూ..! వయసు చిన్నదే కానీ మనసు గొప్పది.. వీధి కుక్కల కోసం ఆ యువకుడు ఏం చేశాడంటే..?
Little Boy Feeding Stray Dogs
Follow us on

సంస్కారం లేని చదువులు వ్యర్థం అనే సూక్తిని మీరు వినే ఉంటారు. ఇంకా మనిషి అన్నవాడికి జాలి, దయ, కరుణ అనేవి తప్పక ఉండాలన్న మాటలు కూడా మీకు తెలిసే ఉంటాయి. ఇక వీటికి సంబంధించిన అనేక కొటేషన్లు, రీల్స్, వీడియోలను నిత్యం సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాం. అయితే అవన్నీ నోటి మాటలే అన్నట్లుగా పెడచెవిన పెడుతుంటారు చాలా మంది. ఆ క్రమంలోనే జాలిదయ లేకుండా ప్రవర్తిస్తుంటారు. వీధిన పోయే కుక్కలకు రాళ్లు వేయడం, కొట్టడం వంటివి చేస్తూ మూగజీవాలపై క్రూరంగా ప్రవర్తిస్తారు. ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకునేవారు కూడా వీధి కుక్కల విషయంలో దయ లేకుండా ప్రవర్తించడం ఇంకా బాధకరమైన విషయం. ఇక ఎవరో మహానుభావులు వాటిపై దయతలిచి అప్పుడప్పుడు మిగిలిన భోజనం, ఆహార పదార్థాలను అందిస్తారు. అయితే ప్రస్తుతం నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ బాలుడు తనలోని దయాగుణాన్ని, మానవత్వాన్ని వీధి కుక్కలపై ప్రదర్శించాడు. అతను చేసిన పనికి నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

mr._naman_rajput అనే ఇన్‌స్టా ఖాతా నుంచి పోస్ట్ అయిన వీడియోలో మనం ఈ దృశ్యాలను చూడవచ్చు. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం రోడ్డు పక్కన వీధి కుక్కలు ఉన్నాయి. స్కూల్‌కి వెళ్తున్న క్రమంలో వాటిని చూసిన బాలుడు.. తాను స్కూల్‌కి తీసుకెళ్తున్న లంచ్ బాక్స్‌లోని ఫుడ్‌ని వీధి కుక్కలకు తినిపించాడు. అందుకోసం వాటిని ఎత్తుకున్నాడు కూడా. వయసులో చిన్న అయినా సంస్కారంలో శిఖరాగ్ర స్థాయిలో ఉన్న ఆ యువకుడి సేవాగుణాన్ని చూసిన నెటిజన్లు.. అతన్ని అభినందిస్తున్నారు. ఇంకా ‘వెల్ మెచ్యూరుడ్’ అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో పోస్ట్ అయిన నాటి నుంచి ఇప్పటివరకు 16 లక్షల మందికి పైగా వీక్షించారు. అలాగే పలువురు కామెంట్ల ద్వారా అతన్ని అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..