భూమిపై ఏనుగు, ఖడ్గమృగం(Rhinoceros) భారీ శరీరం కలిగిన అతిపెద్ద జంతువులు. మనం ప్రమాదకరమైన జంతువుల లిస్ట్‌లో సింహం(Lion), పెద్ద పులి, చిరుత ఇలా వరుసగా వస్తుంటాయి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో సింహాలు ఒకటి. దీని నుంచి మనుషులు మాత్రమే కాదు.. అడవిలోని పెద్ద పులితోసహా.. అన్ని జంతువులు వణుకుతున్నాయి. సింహం వేట మొదలు పెట్టిందంటే దాని చావు ఖాయమనే చెప్పాలి. అయితే కొన్నిసార్లు మాత్రమే సింహం దాడి నుంచి తప్పించుకోగలవు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి, ఈ వీడియోలో సింహాల గుంపు పెద్ద ఖడ్గమృగంను టార్గెట్ చేసి దాడి మొదలు పెట్టాయి. అయితే.. అవి విజయాన్ని దక్కించుకోలేక పోయాయి.
ఈ వీడియోలో సింహం నీరు తాగుతున్నట్లు మీరు చూడవచ్చు.. అదే నీటి కుంటను దాటుకుంటూ ప్రయత్నిస్తుంది ఒక పెద్ద ఖడ్గమృగం. అయితే అది అలా రావడాన్ని గమనించిన సింహాలు తాగునీటిని వదిలి.. వేట మొదలు పెడుతాయి. అవి ఖడ్గమృగాన్ని వెనుక నుంచి పట్టుకుని తన పదునైన పళ్ళతో కొరికేందుకు ప్రయత్నిస్తుంది ఓ సింహం. దానికి మద్దతుగా మిగిలిన సింహాలు కూడా చేరిపోతాయి. అయితే ఖడ్గమృగం తన ప్రాణాలను కాపాడుకోవడానికి తన శక్తిని పూర్తిగా ఉపయోగిస్తుంది. సింహాలను తన దగ్గరికి రానివ్వకుండా.. సింహాలపై దాడి మొదలు పెడుతుంది. సింహాలు వెనక్కి తగడంతో ఖడ్గమృగం పారిపోతుంది. మీరు దృఢంగా ఉంటే.. సింహం వంటి ప్రమాదకరమైన జంతువులు కూడా మీ దగ్గరికి వచ్చేందు ఆలోచిస్తాయని ఈ వీడియో చూస్తే అర్థం అవుతంది.
ఇవి కూడా చదవండి: CM Yogi: ఏయ్ బిడ్డా.. ఇది యూపీ గడ్డ.. యోగి అడ్డా.. 37 ఏళ్ల చరిత్రను తిరగరాసిన బీజేపీ..
G Kishan Reddy: బీజేపీ గెలుపు వెనుక ఆ తెలుగోడు.. గోవాలో చక్రం తిప్పిన కిషన్ రెడ్డి..
Anurag Thakur: యూపీ కురుక్షేత్రంలో బీజేపీకి అక్కరకొచ్చిన యువనాయకుడి రాజకీయ చాణక్యత..