Watch: అయ్యో పాపం..! గడ్డి, ఆకులు తింటున్న సింహం.. అరుదైన వీడియో వైరల్‌

|

Jul 22, 2023 | 3:06 PM

ఇక్కడ సింహం గొర్రెలు, మేకల మాదిరిగా ఆకులను తింటూ కనిపించింది. సింహం ఇలా ఆకులను తింటే సహజంగానే కుతూహలం కలుగుతుంది. ఎందుకు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దీనిపై పలువురు నెటిజన్లు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. దీనిపై సుశాంత నంద కూడా స్పందించారు.

Watch: అయ్యో పాపం..! గడ్డి, ఆకులు తింటున్న సింహం.. అరుదైన వీడియో వైరల్‌
Lion Eating Grass
Follow us on

అడవికి రాజైన సింహం ఆహారం గురించి అందరికీ తెలిసిందే. సింహాలు ఇతర జంతువులను వేటాడి తమను తాము పోషించుకుంటాయి. కానీ, సింహాలు మాంసాన్నే కాదు గడ్డి, ఆకులను కూడా తింటాయని మీకు తెలుసా…? అవును మీరు విన్నది నిజమే.. ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇక్కడ ఓ సింహం పచ్చటి ఆకుల్ని తింటున్న వీడియో ఇప్పుడు కెమెరాకు చిక్కింది.  సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.  అరుదుగా సింహాలు ఇలాంటి ఆకులను తింటాయి. దానికి కారణం ఉంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వన్యప్రాణులు సహజంగానే మనకు ఆసక్తిని కలిగిస్తాయి. ఇక్కడ కనిపించే అరుదైన దృశ్యాలు మనల్ని విస్మయానికి గురిచేస్తాయి. ఇది కూడా అలాంటి సన్నివేశమే. IFS అధికారి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు చాలా వీక్షణలను సంపాదించుకుంది. వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇక్కడ సింహం గొర్రెలు, మేకల మాదిరిగా ఆకులను తింటూ కనిపించింది. సింహం ఇలా ఆకులను తింటే సహజంగానే కుతూహలం కలుగుతుంది. ఎందుకు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దీనిపై పలువురు నెటిజన్లు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. దీనిపై సుశాంత నంద కూడా స్పందించారు. ‘అవును, ఇది మీకు షాక్‌గా ఉండవచ్చు. కానీ సింహాలు కూడా గడ్డి, ఆకులను తినడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది వాటి కడుపునొప్పిని నయం చేయడంలో సహాయపడుతుంది అని సుశాంత నంద క్యాప్షన్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కేవలం 44 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోని అందరూ ఎంతో ఉత్సుకతతో చూస్తున్నారు. దీనికి తోడు కొందరు ఆశ్చర్యకరమైన రెస్పాన్స్ కూడా ఇచ్చారు. పిల్లులు, కుక్కలు కూడా ఇలా గడ్డి తింటాయని కొందరు గుర్తు చేశారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం చాలా వ్యూస్ సంపాదించింది. ఇటువంటి అరుదైన దృశ్యాలు సహజంగానే మనకు వన్యప్రాణుల గురించి మరింత తెలుసుకోవడానికి సహాయపడతాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..