అడవిలోని జంతువులకు రాజనీతి ఒకటే.. వేటాడితేనే కడుపు నిండుతుంది. క్రూర జంతువులు తమ ఆకలిని తీర్చుకునేందుకు మిగిలిన వాటిని వేటాడక తప్పదు. వాటి నుంచి తప్పించుకునేందుకు సాధు జంతువులు తమ బ్రతుకు పోరాటాన్ని సాగిస్తూనే ఉండాలి. తెలివి, చురుకుదనం లేకపోతే అవి క్రూర జంతువులకు ఆహారం కావాల్సిందే.
అడవికి సింహం రారాజు. ఇది జగమెరిగిన సత్యం. మృగరాజు వేట సాలిడ్‌గా ఉంటుంది. సింహాన్ని ఆమడదూరం నుంచి చూస్తే చాలు మిగతా జంతువులు ఠక్కున పారిపోతాయి. సింహం పంజా పవర్ ఎలాంటిదో చూపించేలా రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే అంతటి బలశాలైన సింహం కూడా అప్పుడప్పుడూ ఓటమిని రుచి చూడాల్సిందే. అందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ ఆఫ్రికన్ అడవి దున్న గుంపుకు దూరంగా ఉండటాన్ని చూసిన సింహం.. దాన్ని వేటాడటానికి వ్యూహాన్ని పన్నుతుంది. దానిని వేటాడటానికి వెంటబడుతుంది. సింహం తన పదునైన దవడలతో.. ఆ అడవి దున్నను విలవిలలాడేలా చేస్తుంది. అది ఎటూ వెళ్లకుండా ఉండేలా దానిపైకి ఎక్కి మరీ పట్టుకుంటుంది. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఒకటి చోటు చేసుకుంది. సింహం పెట్టిన బాధను బరిస్తోన్న అడవి దున్న ఒక్కసారిగా ఎదురు తిరుగుతుంది. దాన్ని కొమ్ములతో పొడిచి పరుగు పెట్టిస్తుంది. ఈ వీడియోను ‘Big Cats Namibia’ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. క్షణాల్లో అది కాస్తా వైరల్ అయింది. అడవి దున్న ధైర్యాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.