అడవిలో మనుగడ సాగించాలంటే వేటాడక తప్పదు. క్రూర జంతువులు తమ ఆకలిని తీర్చుకునేందుకు వేటాడుతూ ఉండాలి. అలాగే సాధు జంతువులు వాటి నుంచి తప్పించుకుని ఎలప్పుడూ తమను తాము కాపాడుకుంటూ ఉండాలి. ఇదిలా ఉంటే చిరుతపులులు అద్భుతమైన వేటగాళ్లు. ఇదందరికీ తెలిసిన విషయమే. సింహం, పులి కంటే చిరుత వేటే భయంకరంగా ఉంటుంది. వ్యూహం, ప్రణాళికతో ఎరను తన కనుచూపు మేర నుంచి దూరం కాకముందే చిరుత దాన్ని వేటాడుతుంది.
తాజాగా ఓ చిరుతపులి జింకను వేటాడటానికి ఎలాంటి వ్యూహాన్ని రచించిందో చూపిస్తూ ఇండియన్ ఫారెస్ట్ అధికారిసుశాంత నందా ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిని మరో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సురేందర్ మెహ్రా రీ-ట్వీట్ చేస్తూ.. ”అడవిలో జీవనం సవాళ్లు, అనిశ్చితులతో కలిగి ఉంటుంది.. ఇది ఎరకు.. వేటగాడికి కూడా.. ” హ్యాష్‌ట్యాగ్ జంగిల్ లైఫ్ అని పేర్కొన్నాడు.
ఇక వైరల్ వీడియోలో.. ఓ జింక ప్రశాంతంగా గడ్డి మేస్తూ సేద తీరుతున్నట్లు మీరు చూడవచ్చు. అంతలో దూరం నుంచి చూసిన ఓ చిరుతపులి దాన్ని వేటాడేందుకు నక్కుతుంది. చెట్టు చాటును దాక్కుని అదును చూసి జింకపై మెరుపు దాడి చేస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒకింత షాక్‌కు గురయ్యారు. చిరుత వేట మాములుగా లేదుగా అంటూ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
Life in #wilderness is full of challenges and uncertainties..
Both for Prey and Predator..#JungleLife @susantananda3
VC:SM pic.twitter.com/AMajUqmPzI— Surender Mehra IFS (@surenmehra) August 11, 2021
Also Read:
చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!