Watch Video: బావిలో పడిన చిరుత.. చాకచక్యంగా కాపాడిన రెస్క్యూ బృందం.. నెట్టింట వీడియో వైరల్
Leopard Rescued From Well: వేసవి ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో దప్పికతో అటవీ ప్రాంతంలోని జంతువులు నీటికోసం మైదాన ప్రాంతాల్లోకి వస్తూ ప్రమాదంలో పడుతున్నాయి. తాజాగా.. ఓ చిరుత
Leopard Rescued From Well: వేసవి ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో దప్పికతో అటవీ ప్రాంతంలోని జంతువులు నీటికోసం మైదాన ప్రాంతాల్లోకి వస్తూ ప్రమాదంలో పడుతున్నాయి. తాజాగా.. ఓ చిరుత బావిలో పడింది. ప్రమాదంలో ఉన్న చిరుతను చూసి గ్రామస్థలు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు చిరుతను చాకచక్యంతో రక్షించారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి చిరుతను బోనులో బంధించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట (Social Media) వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. మహారాష్ట్ర దేవల్‌గావ్ రాజా అటవీ రేంజ్ పరిధిలోని ఖలియాల్ గ్రామ సమీపంలోని బావిలో పడిన చిరుతను అటవీ శాఖ బృందం రక్షించినట్లు అధికారులు తెలిపారు.
జాఫ్రాబాద్ తహసీల్‌లోని కుంభార్‌ఝరి గ్రామానికి చెందిన సుఖ్‌దేవ్ బంకర్ ఉదయం తన బావిలో చిరుతపులి ఉన్నట్లు గుర్తించి అధికారులకు సమాచారమిచ్చాడు. దీంతో అటవీ శాఖ అధికారులు, పోలీసుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ముందు బోనును బావిలోకి దింపారు. ఆ తర్వాత చిరుత అక్కడికి చేరుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో.. మరో మంచాన్ని సైతం బావిలోకి దింపారు. చివరకు మంచం మీద నుంచి బోనులోకి చిరుత ప్రవేశించింది.
వైరల్ వీడియో..
#WATCH Maharashtra | The forest department team rescued a leopard that fell into a well near Khaliyal village under the Deulgaon Raja forest range. pic.twitter.com/Mc4KGCO6Fu
— ANI (@ANI) April 7, 2022
అనంతరం వైద్య పరీక్షల కోసం మగ చిరుతను అటవీ కార్యాలయానికి తరలించారు. దీని వయస్సు ఏడాదిన్నర ఉంటుందని.. వైద్య పరీక్షల అనంతరం చిరుతను అడవిలో వదులుతామని అటవీ అధికారి తెలిపారు.
Also Read: