
సహజంగా క్రూర జంతువులు తన కడుపు నింపుకునేందుకు వేరే జంతువులను వేటాడాల్సిందే. వేగానికి, వ్యూహానికి చిరుత పెట్టింది పేరు. సింహం, పులికి ఏమాత్రం తీసిపోకుండా.. చిరుత తన ఎరను ఎంతో ప్రమాదకరంగా వేటాడుతుంది. చిరుత వేటాడేటప్పుడు వేగాన్ని, వ్యూహాన్ని ఖచ్చితంగా అమలు చేస్తుంది. తన కంటికి కనిపించిన జంతువు ఎక్కడికి పారిపోకుండా రెప్పపాటులో దాన్ని వెంబడించి.. వేటాడి.. చంపుతుంది. అయితే ఈ అద్భుతమైన వేటగాళ్లు కూడా కొన్నిసార్లు నిరాశతో వెనుదిరగాల్సిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా అదే పరిణామం ఎదురైంది. కోతిపై ఎటాక్ చేసిన చిరుతకు.. చివరికి నిరాశే మిగిలింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అడవి నియమాలు చాలా భిన్నంగా ఉంటాయని మనందరికీ తెలుసు. ఎవరు ఎవరిని వేటాడటారో.? ఎవరు.? ఎవరి నుంచి తప్పించుకుంటారో అస్సలు చెప్పలేం.? ఓ చెట్టు దగ్గరలో సేద తీరుతున్న కోతుల మందపై దాడి చేసేందుకు చిరుత యత్నించి.. నిరాశతో వెనుదిరుగుతుంది. వీడియోలో కోతుల మందపై చిరుత దాడి చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. అయితే తమపైకి వచ్చిన ప్రమాదాన్ని చూసి అవి బెదరలేదు. ధైర్యంగా పోరాడడానికి సిద్దపడ్డాయి. ఇంకేముంది.. సింగల్‌గా ఎటాక్ చేసేందుకు వచ్చిన చిరుతను అన్ని వైపులా నుంచి చుట్టుముట్టాయి. అవి ఇచ్చిన జలక్‌కు చిరుత తోకముడిచి పారిపోయింది. కాగా, ఈ వీడియోను ”@5_Adel_5” అనే ట్విట్టర్ అకౌంట్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. క్షణాల్లో అది కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు లైకులు, షేర్‌లతో హోరెత్తిస్తున్నారు.
تجمع قردة البابون على ليبورد لطرده ..? pic.twitter.com/I1hhPv9HJF
— ? عالم الإفتراس ? (@5_Adel_5) June 5, 2021
సావిత్రి చేతిలో చిన్నారి బాలుడు.. నేడు టాలీవుడ్‌లో స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా..
నెల ముందు నుంచే ఈ లక్షణాలు కనిపిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం..!
గాడ్ ప్రామిస్ నమ్మండి.. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. Viral Videoపై స్పందించిన ఆర్జీవీ