AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆరుబయట పడుకుని ఫోన్ చూస్తున్న వ్యక్తి.. అక్కడికి మెల్లిగా వచ్చిన చిరుత.. ఆపై

ఒక వ్యక్తి రాత్రి సమయంలో బయట మంచంపై పడుకుని ఫోన్ చూస్తున్నాడు. అతని మంచం పక్కనే ఓ కుక్క కూడా నిద్రిస్తుంది. ఈ సమయంలో చప్పుడు కాకుండా ఓ చిరుత పులి అక్కడికి వచ్చి... నిద్రపోతున్న కుక్కపై దాడి చేసింది. రైతు జయానంద్ కాలే తన ఇంటి బయట నిద్రిస్తుండగా, తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఒక చిరుతపులి ఆవరణలోకి చొరబడింది. అక్కడే నిద్రపోతున్న అతని కుక్కపై దాడి చేసి దానిని తీసుకెళ్లింది.

Viral Video: ఆరుబయట పడుకుని ఫోన్ చూస్తున్న వ్యక్తి.. అక్కడికి మెల్లిగా వచ్చిన చిరుత.. ఆపై
Leopard Attacks Dog
Ram Naramaneni
|

Updated on: Mar 16, 2025 | 12:00 PM

Share

సోషల్ మీడియా పుణ్యమా అని రీల్స్‌ పిచ్చి బాగా ముదిరిపోయింది జనాలకి. వయసుతో సంబంధం లేకుండా ఈ రీల్స్‌లో మునిగిపోతున్నారు. లైక్స్‌, వ్యూస్‌ కోసం రీల్స్‌ కోసం సాహసాలు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకునేవారు కొందరైతే.. నెట్టింట ఈ వీడియోలు చూస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయి ప్రమాదాల్లో పడేవారు ఇంకొందరు. తాజాగా ఓ వ్యక్తి రాత్రి వేళ ఇంటిముందు ఆరుబయట మంచం వేసుకొని పడుకొని రీల్స్‌ చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. మెల్లగా అక్కడికి చిరుత పులి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.

ఆరుబయట మంచం మీద పడుకొని రీల్స్‌లో మునిగిపోయాడు ఓ వ్యక్తి. ఇంతలో ఎక్కడినుంచి వచ్చందో కానీ నెమ్మదిగా నక్కి నక్కి అక్కడికి ఓ చిరుత పులి వచ్చింది. రీల్స్‌లో మునిగిపోయిన అతను చిరుతను గమనించలేదు. అయితే ఆ చిరుత.. అతడి మంచం పక్కనే పడుకొని ఉన్న కుక్కను నోటకరుచుకొని వెళ్లిపోయింది. ఆ శబ్ధానికి ఈ లోకంలోకి వచ్చిన అతను ఏం జరిగిందా అని చుట్టుపక్కలా వెతికాడు. ఇంతలో ఆ చిరుత పులి నోటకరుచుకొని వెళ్లిపోయిన కుక్క.. దాని నుంచి తప్పించుకొని అక్కడికి పరుగు పరుగున వచ్చింది. అప్పుడు కనిపించింది అతనికి చిరుత. దెబ్బకు అక్కడినుంచి ఇంట్లోకి పరుగెత్తి తలుపు వేసేసుకున్నాడు. చిరుతను చూసిన కుక్క అరుస్తూనే ఉంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూణె భోర్ తాలూకా దేగావ్ గ్రామం థాకరే ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.

దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఫోన్‌లో పడితే పక్కన ఏం జరిగినా డోంట్‌ కేర్‌.. అని కొందరు.. కుక్కను అక్కడే వదిలి అతను పారిపోవడం దారుణం అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే ఒకటిన్నర మిలియన్ల మందికి పైగా వీక్షించారు. 16 వేలమందికి పైగా లైక్‌ చేశారు.

భోర్ తాలూకా ప్రాంతంలో పెంపుడు జంతువులపై చిరుతపులుల దాడులు తరచుగా జరుగుతున్నాయి, దీనివల్ల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని నివాసితులు ఇప్పుడు కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై