లేడీ భగీరథి..! పిల్లల నీటి కష్టం చూసి కరిగిపోయింది.. 55 ఏళ్ల గౌరి ఏకంగా ఏం చేసిందో తెలుసా..?

|

Feb 08, 2024 | 12:26 PM

నీటి కొరత తనను బావులు తవ్వడానికి ప్రేరేపించిందని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రంలోనే 15 మంది చిన్నారుల సంరక్షణ, చదువులు సాగుతున్నాయన్నారు. నిత్యం నీటి కొరత ఇక్కడ పెద్ద సవాలుగా మారింది. హట్గర్ గ్రామపంచాయతీ ప్రతి రెండు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తుంది. పిల్లలు అంగన్‌వాడీ కేంద్రానికి దూరంగా వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారు. బావిని సిద్ధం చేస్తే నీటి సమస్య ఉండదని చెప్పారు.

లేడీ భగీరథి..! పిల్లల నీటి కష్టం చూసి కరిగిపోయింది.. 55 ఏళ్ల గౌరి ఏకంగా ఏం చేసిందో తెలుసా..?
Lady Bhagirath
Follow us on

ఆడవారు ఏ పనిలోనూ మగవారి కంటే తక్కువ కాదు. స్త్రీలు పురుషులకు పోటీని ఇవ్వని రంగమేదీ లేదు. గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుడు, పర్వతాన్ని తొలగించి మార్గం కనిపెట్టిన బీహార్‌కు చెందిన దర్శత్ మాఝీ కంటే తక్కువ కాదు. అలాంటి ఒక మహిళను ఈ రోజు మేము మీకు పరిచయం చేస్తున్నాము. కర్ణాటకకు చెందిన ఈ మహిళ నీటి ఎద్దడిని పరిష్కరించడంలో తానే స్వయంగా శ్రమిస్తోంది. ఈ మహిళ ఇప్పటి వరకు రెండు బావులు తవ్వగా, ప్రస్తుతం మూడోది మొదలుపెట్టింది. కర్ణాటకలోని సిర్సిలో నివసిస్తున్న 55 ఏళ్ల గౌరీ చంద్రశేఖర్ నాయక్ నీటి కొరతను అధిగమించడానికి బావిని తవ్వే పనిని చేపట్టింది. ఈమె గురించి తెలిసిన చాలా మంది ప్రజలు ఆమెను లేడీ భగీరథ అని పిలుస్తున్నారు.

ఉత్తర కన్నడ జిల్లాలోని గణేష్ నగర్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ అంగన్‌వాడీలకు వచ్చే పిల్లలకు నీటి కష్టాలు ఉండకూడదని భావించి తానే స్వయంగా బావి తవ్వడం ప్రారంభించింది. గౌరి చంద్రశేఖర్ నాయక్ అనే మహిళ తన ఇంటి సమీపంలోని అంగన్ వాడీ కేంద్రం వద్ద 4 అడుగుల వెడల్పు గల బావిని తవ్వే పనిని వారం రోజుల క్రితం ప్రారంభించారు. రోజూ ఒకటిన్నర అడుగుల లోతు తవ్వింది. పలుగు, పార, బుట్ట, తాడు వంటి వాటి సహాయంతో ఆమె కష్టపడి లోతైన బావిని తవ్వేందుకు మట్టిని ఎత్తిపోస్తుంది. అంగన్ వాడీలకు మంచి నీటి వసతి కల్పించేందుకు నెల రోజుల్లో బావిని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గౌరీనాయక్ కుమారుడు వినయ్ నాయక్ మాట్లాడుతూ.. తన తల్లి రోజూ ఉదయం 7.30 గంటలకు కూలి పనులకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి వచ్చేదని తెలిపారు. ఆమె మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటలకు తిరిగి వస్తుంది.

ఇవి కూడా చదవండి

బావి తవ్వడం వెనుక ఉన్న స్ఫూర్తి గురించి గౌరి చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ.. గణేష్ నగర్‌లో నీటి కొరత ఉందన్నారు. అంగన్‌వాడీలకు వచ్చే చిన్నారులకు తాగునీరు లేక అవస్థలు పడుతున్నారని చెప్పింది.. నీటి కోసం పిల్లలు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ నీటి కొరత తనను బావులు తవ్వడానికి ప్రేరేపించిందని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రంలోనే 15 మంది చిన్నారుల సంరక్షణ, చదువులు సాగుతున్నాయన్నారు. నిత్యం నీటి కొరత ఇక్కడ పెద్ద సవాలుగా మారింది. హట్గర్ గ్రామపంచాయతీ ప్రతి రెండు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తుంది. పిల్లలు అంగన్‌వాడీ కేంద్రానికి దూరంగా వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారు. బావిని సిద్ధం చేస్తే నీటి సమస్య ఉండదని చెప్పారు.

గౌరి ఈ పని చేయడం మొదటి సారి అని కాదు. ఇంతకు ముందు కూడా ఆమె 2017, 2018లో రెండు బావులు తవ్వింది. ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదని భావించి ఈ పని చేస్తున్నారు. తమలపాకు పంటకు నీరందించేందుకు ఇంటి దగ్గర 65 అడుగుల లోతు బావి తవ్వించానని చెప్పారు. తన చిన్న పొలానికి నీటి కొరత తీవ్రంగా ఉందని గౌరి చెప్పింది. అందుకే మూడు నెలల్లో బావి తవ్వాలని నిర్ణయించుకుని విజయం సాధించింది.. పొలంలో మరో 40 అడుగుల లోతులో మరో బావి తవ్వారు.