
ఇంటర్నెట్‌లో రోజూ పదులు సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. రకరకాల ఫన్నీ వీడియోలతో పాటు వణ్య ప్రాణులకు సంబంధించిన కంటెంట్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు చూసేందుకు నెటిజన్లు మరింత ఆసక్తిని కనబరుస్తారు. ఈ నేపథ్యంలో నాగుపాముకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. కింగ్ కోబ్రా, రాకాసి బల్లి ఎదురెదురు కావడం మీరు చూడవచ్చు. ఇక్కడ రాకాసి బల్లి, నాగుపాముతో యుద్ధం చేసేందుకు ఒక అడుగు వెనక్కి వేస్తుండగా.. కింగ్ కోబ్రా మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఎదురెళ్లింది. చివరికి నాగుపాముతో పోరాటం ఎందుకులే అనుకున్నట్లు ఉంది.. రాకాసి బల్లి తన దిశను మార్చుకుని యుద్దానికి దిగకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా, ఈ వీడియోను ‘thedaily.animals’ అనే ఇన్‌స్టా పేజీ అప్‌లోడ్ చేయగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి లైకులు, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ సారి వీడియోపై లుక్కేయండి.