Viral Video: నడిరోడ్డుపై కుప్పకూలిన గుర్రం.. ఓనర్‌ నిర్లక్ష్యంపై పోలీసుల ఆగ్రహం.. కేసు నమోదు!

దేశంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. సూర్యోదయం అయిందంటే చాలు ప్రజలపై భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మాడు పగిలే ఎండలు కొడుతుండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రికార్డ్‌ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మనషులతో పాటు మూగజీవులు కూడా విలవిలలాడుతున్నాయి. ఈ క్రమంలో మండె ఎండల్లో రోడ్డుపై బండిని లాగుతూ వెళ్తున్న ఓ గుర్రం నిస్సహాయ స్థితిలో కుప్పకూలి పడిపోయిన ఘటన అందరినీ కలచివేస్తోంది. గుర్రం పట్ల యజమాని ప్రవర్తించిన తీరు నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.

Viral Video: నడిరోడ్డుపై కుప్పకూలిన గుర్రం.. ఓనర్‌ నిర్లక్ష్యంపై పోలీసుల ఆగ్రహం.. కేసు నమోదు!
Viral Video

Updated on: May 02, 2025 | 1:05 PM

దేశంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్న వేల.. ఎండ వేడికి తట్టుకోలేక దాహంతో అలసిన ఓ గుర్రం.. బండిని లాగలేక నిస్సహాయ స్థితిలో కుప్పకూలి పడిపోయిన వీడియో ప్రస్తుతం అందరినీ కలచివేస్తోంది. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతా నగర వీధుల్లోని రోడ్లపై ఓ గుర్రం బండి వెళ్తోంది. ఆ గుర్రం బండిని రెండు గుర్రాల్లు లాక్కొన్ని వెళ్తున్నాయి. ఈ క్రమంలో  ఓ గుర్రం ఎండ వేడికి తట్టుకోలేక దాహంతో అలసిపోయి, గుర్రపు బండిని లాగలేక ఒక్కసారిగా రోడ్డుపైనే కుప్పకూలిపోయింది. అయితే ఆ గుర్రానికి నీళ్లు పోసి దాహం తీర్చాల్సిన యజమాని మాత్రం దాని పట్ల క్రూరంగా ప్రవర్తించారు. దాన్ని కొడుతూ బలవంతంగా తాడుతో లాగుతూ లేపే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ఒంట్లో శక్తి లేక సొమ్మసిల్లి పడిపోయిన గుర్రం లేవలేక పోయింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఈ వీడియో చూసిన జంతుప్రేమికులు ఆ యజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగజీవి పట్ల క్రూరంగా ప్రవర్తించిన ఆ యజమానిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ అధికారులను, పోలీసులను ట్యాగ్‌ చేస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారి, ప్రభుత్వం పోలీసుల దృష్టికి చేరడంతో గుర్రపు బండి యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత అతనిపై చర్యలు తీసుకున్నట్టు పోలీసుటు ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…