
ఎగ్జామ్ టైమ్‌లో స్టూడెంట్స్ రాసే సమాధానాలు చదివితే కొన్నిసార్లు టీచర్లకే నవ్వు ఆపుకోలేని పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా బ్యాక్ బెంచ్ కంత్రీలు తమకు ఉన్న ఇస్మార్ట్ తెలివిని పేపర్‌పై ప్రదర్శిస్తూ ఉంటారు. వారి సమాధానాలకు మార్కులు రాకపోయినా.. మజా మాత్రం పక్కా గ్యారంటీ. ఇక తాజాగా ఓ చిన్నోడు రాసిన సమాధానం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రశ్న పేపర్‌లో ‘నీ హీరో ఎవరు?’ అని ప్రశ్న ఉంది. చాలా మంది పిల్లలు ఇలాంటి ప్రశ్నకు సినిమా హీరో పేర్లు రాస్తారు. కానీ ఈ స్టూడెంట్ మాత్రం తన మనసులోని మాట రాసేశాడు. ‘మా నాన్న’ అని క్లియర్ కట్ సమాధానం ఇచ్చాడు.
ఆ తర్వాతి ప్రశ్న ‘ఆయన్ని ఎందుకు హీరో అనుకుంటావు?’ అని ఉంది. ‘ఆయన చాలా ధైర్యవంతుడు’ అని సమాధానం రాశాడు. పర్ఫెక్ట్ ఎలివేషన్, పూర్తి గౌరవంతో పేపర్‌లో తండ్రిని అసలైన హీరోలా చూపించాడు. కానీ అసలు కామెడీ పంచ్ ఆ తర్వాత ఉంది. తదుపరి ప్రశ్న ‘నీ హీరో ఎవర్ని చూసి అయినా లేదా దేని గురించి అయినా భయపడతాడా?’ అని ఉంది. దానికి ఆ చిన్నోడు ‘అమ్మ’ అంటూ ఊహించని సమాధానం రాశాడు.
Also Read: నదిలో స్కూబా డైవింగ్ చేస్తుండగా మహిళకు కనిపించిన 100 ఏళ్ల నాటి సీసా.. దాని లోపల
తండ్రిని ఆకాశం ఎత్తుకు లేపిన చిన్నోడు.. ఒక్క వాక్యంతో గాలి తీశాడు. తండ్రి ధైర్యవంతుడు కదా, కానీ అమ్మ ముందు మాత్రం ఆయనకూ భయం ఉంటుందని చమత్కారంగా రాసేశాడు. ఇప్పుడు ఆ చిన్నోడు రాసిన సమాధానం నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది. కొందరు ఇంత చిన్న వయసులోనే జీవిత సత్యం గ్రహించేశాడు బాబూ అని కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..