ఆధ్యాత్మికత అనే సాగరం ఈదుతున్న కొద్దీ మరిన్ని కొత్త అనుభవాలు వస్తూనే ఉంటాయి. జీవితంలో తపస్సు చేసే యోగులు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడం సర్వసాధారణం. అయితే ఇక్కడ అత్యంత వేతనం పొందుతున్న ఓ టెక్కీ తన ఐటీ వృత్తిని వదిలి పూజారి వృత్తిలో స్థిరపడ్డాడు. ఆధ్యాత్మికతను వెతుక్కుంటూ ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి పూజారిగా మారిన ఈ టెక్కీ విచిత్ర కథ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అతను ఐటి కెరీర్‌ను వదిలిపెట్టి దేవుడి గుళ్లో పూజారిగా సెటిల్ అయ్యాడు. ఆధ్యాత్మిక సేవలో చేరిన అత్యంత వేతనం అందుకుంటున్న టెక్కీ కథ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. కేరళకు చెందిన 34 ఏళ్ల ఉన్నికృష్ణన్ తన ఐటీ ఉద్యోగాన్ని వదులుకుని తన ఆసక్తితో పూజారి అయ్యాడు. అయితే, అతను పూజారి మాత్రమే కాదు, బైక్ రేస్ క్రేజ్.. బైక్‌లు నడపడం హాబీ అతడికి. దాంతో టెక్కీ పూజారి అతని ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రయాణించడంతోపాటు అతనికి ఇష్టమైన బైక్ రైడ్‌కు కూడా వెళ్తుంటాడు. ఇలా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు.
కేరళలోని కొట్టాయం జిల్లా మంజూర్ గ్రామంలోని పుదుక్కులంగర దేవి ఆలయంలో పూజారిగా ఆధ్యాత్మిక ప్రయాణం సాగిస్తున్నాడు. చాలా మంది ఉదయాన్నే ఆలయానికి వచ్చి వెళ్తుండడంతో ఆలయంలో పూజా కార్యక్రమాలు ఉదయం 9.30 గంటలకు ముగుస్తాయి. తరువాత అతను తన పూజారి వస్త్రాలను తొలగించి, బైక్ రేసింగ్ తో మరో కొత్త రూపంలో కనిపిస్తాడు. కాళ్లకు షూస్, చేతులకు గ్లౌజులు, హెల్మెట్, రేసింగ్ సూట్ ధరించి, పూజారికి పూర్తి రివర్స్‌లో రెడీ అవుతాడు. కొండల నడుమ మట్టి రోడ్డులో బైక్ రైసింగ్ అంటే అతనికి పిచ్చి.
2007లో డ్రైవింగ్ లైసెన్స్ పొందినప్పటి నుంచి ఉన్నికృష్ణన్‌కు మోటార్‌సైకిళ్లపై మక్కువ మొదలైంది. అతని ఆసక్తిని పెంచుకోవడానికి కొచ్చిలోని ఒక ప్రొఫెషనల్ స్టంట్ రైడింగ్, రేసింగ్ క్లబ్‌లో చేరాడు. 2011లో అతను కొచ్చి రేసింగ్ క్లబ్‌లో నైపుణ్యం కలిగిన స్టంట్ రైడర్‌గా మారాడు. 2010లో కార్పొరేట్ ప్రపంచంలో చేరినప్పుడు ఈ యువ పూజారి తన అభిరుచిని పక్కన పెట్టాల్సి వచ్చింది. కానీ, 2013లో తన హాబీని కొనసాగించేందుకు గానూ అతడు తన ఆఫీసు జీవితం, నైట్ షిఫ్ట్‌లకు గుడ్‌భై చెప్పేశాడు. రేసింగ్‌పై తన అభిరుచిని కొనసాగించేందుకు అధిక డిమాండ్, అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. ఆ తరువాత అతను రేసింగ్ కెరీర్‌లో స్థిరపడిపోయాడు. భారతదేశం నుండి నేపాల్‌కు బైక్ ట్రిప్‌కు వెళ్లాడు.
ఉన్నికృష్ణన్ తండ్రి నారాయణన్ నంబూతిరి కూడా పూజారి. అతని ఊహించని మరణం తర్వాత ఉన్నికృష్ణన్ ఆలయ బాధ్యతలు చేపట్టారు. అతను డిసెంబర్ 2021 నుండి అధికారికంగా ఆలయ పూజారి, దానితో పాటు తన బైక్ రేసింగ్ అభిరుచిని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే చాలా రేసుల్లో పాల్గొన్నాడు ఉన్ని కృష్ణన్. అతను ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొన్నాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..