Viral Video: నాగుపాములతో స్టంట్ చేద్దామనుకున్నాడు.. చివరకు అనూహ్యమైన ట్విస్ట్.. చూస్తే ఫ్యూజులౌట్..

|

Mar 17, 2022 | 1:27 PM

Stunt With 3 Cobras: పాములను చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం.. అలాంటిది ఓ యువకుడు పాములతోనే స్టంట్ చేయాలనుకున్నాడు. మూడు తాచుపాములకు ఏదో క్లాసులు చెప్పినట్లు ఫోజులిచ్చాడు.

Viral Video: నాగుపాములతో స్టంట్ చేద్దామనుకున్నాడు.. చివరకు అనూహ్యమైన ట్విస్ట్.. చూస్తే ఫ్యూజులౌట్..
Viral Video
Follow us on

Stunt With 3 Cobras: పాములను చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం.. అలాంటిది ఓ యువకుడు పాములతోనే స్టంట్ చేయాలనుకున్నాడు. మూడు తాచుపాములకు ఏదో క్లాసులు చెప్పినట్లు ఫోజులిచ్చాడు. ఇంతలోనే ఓ పాము ఊహించని షాక్ ఇచ్చింది. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దానిని చూసి.. నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి మూడు పాములతో చేసిన భయంకరమైన స్టంట్‌లో ఒక పాము అతనిపై ఒక్కసారిగా దాడి చేసింది. సిర్సీకి చెందిన మాజ్ సయ్యద్ అనే యువకుడు పాములతో స్టంట్‌లు చేస్తుంటాడు. అయితే.. మూడు నాగుపాములను పట్టి వాటితో స్టంట్ చేయడానికి సిద్ధమవుతాడు. ఈ సమయంలో మూడు పాముల ఎదుట కూర్చొని వాటిని ఆడిస్తుంటాడు. ఈ క్రమంలో వాటి తోకలను పట్టుకోని లాగుతూ కదిలిస్తుంటాడు. ఈ క్రమంలో తాచులు.. దూకుడుగా స్పందిస్తుంటాయి. ఓ పాము ఒక్కసారిగా యువకుడిపై దాడి చేస్తుంది. తన నోటితో ప్యాంట్‌ను గట్టిగా పట్టుకుంటుంది.

అయితే.. వెంటనే అప్రమత్తమైన ఆ యువకుడు దాని తోక పట్టుకొని లాగేందుకు ప్రయత్నించినా అది గట్టిగా పట్టుకోనే కనిపిస్తుంది. ఈ పాము కాటుతో సయ్యద్ ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. సయ్యద్‌కి చెందిన YouTube ఛానెల్‌లో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయని.. అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు జంతుప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా యువకుడి తీరుపై మండిపడ్డారు. పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఇలాంటి భయంకరమైన విన్యాసాలు తగదంటూ సూచించారు. కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు.


కాగా.. పాము కాటుతో ఆసుపత్రి పాలైన మాజ్ సయ్యద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని స్నేక్‌బైట్ హీలింగ్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ ప్రియాంక కదమ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తాచుపాములు చాలా విషపూరితమైనవని.. సయ్యద్ ఇప్పటివరకు 46 యాంటీ-వెనమ్ ఇంజెక్షన్లను తీసుకున్నట్లు వెల్లడించారు. వన్య ప్రాణులకు హాని తలపెడుతున్న అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. పాములతో ఎవ్వరూ కూడా ఇలాంటి స్టంట్లు చేయొద్దంటూ సూచించారు.

Also Read:

Viral Video: చేతిలో సిగరెట్.. మరో చేతితో పాము.. ఈ యువతి స్టైల్ చూస్తే మతిపోవాల్సిందే.!

Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. ఎక్కడుందో కనిపెడితే మీరే గ్రేట్.!