WATCH: దళిత స్వామీజీ ఎంగిలి అన్నం తిన్న ఎమ్మెల్యే జమీర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. ఎందుకు ఇలా చేశాడంటే..

|

May 23, 2022 | 1:33 PM

కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌.. ఓ దళిత స్వామిజీతో కలిసి భోజనాన్ని పంచుకున్నారు. అది అలాంటి ఇలాంటి ఆహారం కాదు. ముందుగా స్వామిజీ నోట్లో పెట్టిన ఆహారంను ఆ తర్వాత బయటకు తీసుకుని తన నోట్ల పెట్టుకుని మరి తిన్నాడు ఎమ్మెల్యే. దళిత వర్గానికి చెందిన స్వామి..

WATCH: దళిత స్వామీజీ ఎంగిలి అన్నం తిన్న ఎమ్మెల్యే జమీర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. ఎందుకు ఇలా చేశాడంటే..
Mla Bz Zameer A Khan
Follow us on

సోషల్ మీడియాలో టాప్ రేంజ్‌లో దూసుకుపోయే కర్నాటక కాంగ్రెస్‌ శాసనసభ్యుడు జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌(BZ Zameer A Khan) మరోసారి వార్తల్లో నిలిచారు. అతను చేసిన పనికి కొందరు షభాష్ అంటే.. ఇదేం పని అంటూ ముక్కువేలసుకుంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌.. ఓ దళిత స్వామిజీతో కలిసి భోజనాన్ని పంచుకున్నారు. అది అలాంటి ఇలాంటి ఆహారం కాదు. ముందుగా స్వామిజీ నోట్లో పెట్టిన ఆహారంను ఆ తర్వాత బయటకు తీసుకుని తన నోట్ల పెట్టుకుని మరి తిన్నాడు ఎమ్మెల్యే. దళిత వర్గానికి చెందిన స్వామి నారాయణ.. చామరాజ్‌పేట కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ ఈ చేష్టలకు మొదట షాక్ అయ్యాడు. తమ మధ్య కుల వివక్షకు తావులేదని, పైగా తమ మద్య సోదరభావం ఏపాటిదో చెప్పేందుకు తాను ఈ పని చేసినట్లు బల్లగుద్ది మరీ ప్రకటించుకున్నాడాయన. ఈ ఘటన చూసి మొదట షాక్ అయిన అనుచరులంతా తేరుకుని చప్పట్లతో స్వాగతించారు. అల్‌ అజర్‌ ఫౌండేషన్‌ స్కూల్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి, ఈద్‌ మిలాద్‌ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జమీర్‌ స్వామీజీ ఎంగిలిని భుజించారు.

ఎమ్మెల్యే ఇలా చేయడానికి కారణం ఇదే..

ఇవి కూడా చదవండి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో దళితుడు వంట చేయడంపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ వివాదం నేపథ్యంలో జమీర్ అహ్మద్ ఖాన్ దళిత స్వామీజీ నాగరాజ్‌ను సమర్థించారు, మేము అంటరానితనానికి వ్యతిరేకంగా మిగిలిపోయిన వాటిని తినడం ద్వారా ప్రతిఘటించేందుకు ప్రయత్నించాము. మొత్తానికి ఈ చర్య అనుకూల, విపక్షాల చర్చకు దారితీసింది. సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఈ వీడియో షేర్ చేయబడింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అనుకూల వ్యతిరేక అభిప్రాయాలు..

ఎమ్మెల్యే జమీర్ తీరుపై అనుకూల వ్యతిరేక అభిప్రాయాలకు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. సోషల్ నెట్‌వర్క్‌లలో దీని గురించి చాలా చర్చలు జరుగుతోంది. సుహృద్భావానికి నమూనాగా జమీర్ చర్యను కొందరు సమర్థించారు. మరి కొందరు మాత్రం ఇంతలా ఎందుకు ? అంటూ ప్రశ్నిస్తున్నారు.  జమీర్ వైఖరి, ప్రవర్తన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

వైరల్ న్యూస్ కోసం..