సాధారణంగానే పిల్లలకు చాక్లెట్స్ పిచ్చి.. చాక్లెట్స్ కోసం మారాం చేస్తుంటారు. అలాంటి తీపి పంచే చాక్లెట్స్ పిల్లల ప్రాణం తీస్తుందని తెలిస్తే ఎవరికైనా సరే భయం వేస్తుంది. కానీ, చాక్లెట్స్ తింటూ ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రాణం పోయింది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. గొంతులో చాక్లెట్ ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మరణించాడు.
బాలుడు కంటి ఆకారంలో ఉండే స్టిక్కీ చాక్లెట్‌ను తింటుండగా అది గొంతులో ఇరుక్కుపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. అక్కడ డాక్టర్స్ దానిని తీయలేకపోయారు. దీంతో మరో మూడు, నాలుగు ఆసుపత్రులకు బాలుడిని తీసుకుని పరుగులుపెట్టారు ఆ తల్లిదండ్రులు.
ఇక్కడ క్లిక్ చేయండి..
ఎక్కడా బాలుడికి చికిత్స దొరక్కపోవడంతో సుమారు మూడు గంటల పాటు పోరాడిన బాలుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటనలో స్థానికులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కళ్లేదుటే తమ బిడ్డ ఊపిరాడక కొట్టుకుంటే.. చూసిన ఆ కన్నవాళ్లు గుండెలు పగిలిపోయేలా రోధించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..