Watch: బాంబ్‌పై బాక్స్ పెట్టి దానిపైన కూర్చోవాలని పందెం.. రంగంలోకి దిగిన యువకుడు.. చివరకు

సరదా అనేది కొంతవరకు మాత్రమే బాగుంటుంది. విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తే.. అది ఏ విషయంలోనైనా అనర్థమే. ఏదైనా సరే హద్దులు మీరితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పడానికి ఈ ఘటనే అసలైన ఉదాహరణ.. దీపావళి వేళ కొంతమంది వికృతానందం కోసం చేసిన పనికి.. యువకుడి ప్రాణాలు గాల్లో కలిశాయి.

Watch: బాంబ్‌పై బాక్స్ పెట్టి దానిపైన కూర్చోవాలని పందెం.. రంగంలోకి దిగిన యువకుడు.. చివరకు
Crime News
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 04, 2024 | 7:48 PM

దీపావళి వేళ.. కొందరు ఫ్రెండ్స్ మధ్య జరిగిన సరదా.. వికృత క్రీడగా మారి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ కుటుంబాన్ని తీవ్ర శోకంలోకి నెట్టేసింది..  అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.. బెంగళూరులోని కోననకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలోని వీవర్స్ కాలనీలో దీపావళి వేడుకల్లో భాగంగా శబరీష్ అనే వ్యక్తి, అతని స్నేహితులు టపాసులు కాల్చుతున్నారు. పెద్ద సంఖ్యలో క్రాకర్లు కాల్చి సరదాగా గడుపుతున్నారు. అప్పటికే స్నేహితులందరూ ఫుల్లుగా పార్టీ చేసుకుని మద్యం మత్తులో తూలుతున్నారు. ఇదే క్రమంలో పేలుస్తున్న ఆ క్రాకర్లపై స్టీల్ బాక్స్ పెట్టి కూర్చోమని స్నేహితులు అంతా కలిసి శబరీష్ కు సవాల్ విసిరారు. అలా చేస్తే ఆటో రిక్షా కొనిచ్చి ఇస్తామంటూ అతనిలో ఆశరేపారు.. దీంతో విచక్షణ కోల్పోయి మద్యం మత్తులో ఉన్న శబరీష్ కూడా అలాగే చేశాడు.

అక్కడ ఏం జరుగుతుందో.. ఏం చేస్తున్నారో వాళ్లకు అర్ధంకాలేదు. శబరీష్ కు కూడా అర్థం కాలేదు.. పెద్ద టపాసు (ఫైర్ క్రాకర్) ను పెట్టి వెలిగించి దానిపై ఒక స్టీల్ బాక్స్ పెట్టి.. దానిపై శబరీష్ ను కూర్చోబెట్టారు. ఆ తర్వాత మిగతావాళ్లందరూ మెల్లగా అక్కడ నుంచి కొంచెం దూరంగా వెళ్లారు. ఇంకేముంది.. క్రాకర్స్ భారీ పేలడంతో దాని మీద కూర్చున్న శబరీష్ ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు. భారీగా ఓ బాంబ్ మాదిరి టపాసులు పేలడంతో శబరీష్ తీవ్రంగా గాయపడ్డాడు.

వీడియో చూడండి..

దీంతో వెంటనే అతనిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, చికిత్స విఫలమై శబరీష్ నవంబర్ 2న మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను కొనకుంటె పోలీసులు అరెస్టు చేశారు. దీపావళి పండగ రోజున జరిగిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఏది ఏమైనా మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి సరదా పేరుతో పాల్పడిన ఈ ఘటనతో ఒక నిండు ప్రాణం బలైంది. యువత తప్పుడు దారిలో వెళ్లరాదని, చేస్తున్న పనిపై కనీస విచక్షణ కలిగి ఉండాలని.. లేదంటే ఇలాంటి అనర్థాలే చోటు చేసుకుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..