Viral: పొట్టలో నొప్పితో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. సీటీ స్కాన్ రిపోర్ట్ చూసి నిర్ఘాంతపోయిన డాక్టర్స్

బాధను బయటకు చెప్పుకోలేక, ఆ మతిస్థిమితం లేని వ్యక్తి అల్లాడిపోయాడు. ఎంతో నరకం అనుభవిస్తున్న అతడికి జునాగఢ్​ ఆస్పత్రి వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు.

Viral: పొట్టలో నొప్పితో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. సీటీ స్కాన్ రిపోర్ట్ చూసి నిర్ఘాంతపోయిన డాక్టర్స్
Stomach CT Scan (Representative image)

Updated on: Sep 01, 2022 | 7:24 AM

ఆ వ్యక్తికి పుట్టినప్పటి నుంచి మెంటల్ బ్యాలెన్స్ సరిగ్గా లేదు. మాటలు మాట్లాడలేడు. చెవులు కూడా సరిగ్గా వినపడవు. కాగా ఇటీవల కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో.. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో టెస్టులు చేసిన డాక్టర్లు స్టన్ అయ్యారు. అతని పొట్టలో అనేక వ్యర్థాలు ఉండటం చూసి.. నిర్ఘాంతపోయారు. రోగి బాధను బయటకు చెప్పలేక.. ఎంత మదనపడుతున్నాడో అర్థం చేసుకుని.. వెంటనే ఆపరేషన్ చేశారు. అతని కడుపు నుంచి  2 హెన్నా కోన్​లు, 15 ప్లాస్టిక్ స్ట్రాస్, దాదాపు 62 చెక్క ముక్కలను రిమూవ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే… గుజరాత్(Gujarat)​ వీరావల్(Veraval)​లోని మాల్​దా ఏరియాకు చెందిన.. అర్జున్ చంద్పా(40)కు బై బర్త్ మతిస్థిమితం సరిగ్గా లేదు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ అతడిని జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. అయితే చాలా రోజుల నుంచి చంద్బా ముభావంగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు కడుపు నొప్పితో విలవిల్లాడుతున్నాడు.  దీంతో బంధువులు జునాగఢ్(Junagadh)​ గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడికి సీటీ స్కాన్ చేసి కడుపులో అనేక వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమించికముందే ఆపరేషన్ చేయాలని డిసైడయ్యారు. 2 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి.. అతని కడుపు నుంచి 15 ప్లాస్టిక్​ స్ట్రాలు, 2 హెన్నా కోన్​లు,  62 చెక్కముక్కలు బయటకు తీశారు. ఇవన్నీ అతడి కడుపులో ఒక గడ్డ మాదిరిగా మారాయి. సరైన అవగాహన లేక బాధితుడు వాటిని మింగి ఉంటాడని అని వైద్యులు తెలిపారు.

Patient

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..